India Tour of West Indies : భారత్ వన్డే, టెస్ట్ టీమ్ వివరాలను బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఈ క్రమంలో వెస్టిండీస్ పర్యటనకుఎంపిక చేసిన టెస్ట్ టీమ్ కోసం టీమ్ఇండియా పేసర్ నవ్‌దీప్ సైనీని తీసుకుంది. 2021 జనవరి నుంచి టెస్టులు ఆడని సైనీ.. కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లాడు. అప్పుడే అతడికి భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. దీంతో సంతోషం వ్యక్తం చేసిన సైనీ తనకు ఈ అవకాశం దక్కుతుందని అస్సలు ఊహించలేదన్నాడు.
"నేను కౌంటీ క్రికెట్ ఆడేందుకు లండన్‌కు వచ్చాను. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు నేను ఎంపికయ్యానని తెలిసింది. అయితే ఈ సిరీస్‌కు ఎంపికవుతానని నేను ఊహించలేదు. ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు నెట్ బౌలర్‌గా లేదా స్టాండ్ బై ప్లేయర్‌గా అయినా నన్ను తీసుకుంటారని భావించాను. అందుకే ఐపీఎల్ సమయంలోనే డ్యూక్ బాల్స్‌తోనే ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు వెస్టిండీస్‌కు వెళ్లే ముందు ఒక కౌంటీ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ఇది నాకు మంచి ప్రాక్టీస్‌గా కూడా ఉపయోగపడుతుంది. నేను వెస్టిండీస్ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. మొదటిసారి వెళ్లినప్పుడు నాకు ఆడే అవకాశం రాలేదు. అక్కడి వాతావరణం గురించి నాకు బాగా తెలుసు. పిచ్‌లు చాలా స్లోగా ఉంటాయి " అని నవ్‌దీప్ సైనీ చెప్పుకొచ్చాడు.