Team India New Adidas Jersey : టీమ్ఇండియా కొత్త కిట్ స్పాన్సర్‌గా ఇటీవలే బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్ 'అడిడాస్'.. కొత్త జెర్సీలను విడుదల చేసింది. ముంబయిలోని వాంఖడే స్డేడియంలో భారత క్రికెట్ జట్టు మూడు ఫార్మాట్లకు చెందిన జెర్సీలను ఆవిష్కరించింది. దీంతో పాటు అధికార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. "ఒక ఐకానిక్ క్షణం. ఒక ఐకానిక్ స్టేడియం. కొత్త టీమ్ ఇండియా జెర్సీలను పరిచయం చేస్తున్నాము" అంటూ రాసుకొచ్చింది.
Team India Adidas Deal : టీమ్ఇండియా కొత్త కిట్ స్పాన్సర్‌గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్ 'అడిడాస్'తో బీసీసీఐ గత నెలలో ఒప్పందం కుదుర్చుకుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా.. ఈ ఒప్పందం జూన్ 1 నుంచి అమలులోకి రానుందని అప్పుడే ప్రకటించారు. ఒప్పంద ప్రక్రియ.. అడిడాస్‌తో ఒప్పందం 2028 వరకు అడిడాస్.. టీమ్ఇండియాతో కొనసాగనునుంది. ఈ అగ్రిమెంట్లో భాగంగా స్పాన్సర్‌గా ఉండనున్న అడిడాస్.. ఒక్కో మ్యాచ్‌కు రూ.65 లక్షలు దాకా బీసీసీఐకు చెల్లించనుంది. ఈ లెక్కన ప్రతి ఏడాది అన్ని ఫార్మాట్లలో మ్యాచ్‌లు కలుపుకొని సుమారు రూ.70 కోట్లు చెల్లించేందుకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. జూన్ 7-11 తేదీల్లో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ నుంచే అడిడాస్ స్పాన్సర్షిప్ అమలుకానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం.. అడిడాస్ జెర్సీలను విడుదల చేసింది.