పాకిస్థాన్ జట్టులా టీమ్ఇండియా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోదని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్(sehwag news) అన్నాడు. 'ఈసారి చరిత్ర సృష్టించబోతున్నాం' అని పాకిస్థాన్‌కు చెందిన ఓ యాంకర్ చేసిన వ్యాఖ్యలకు సెహ్వాగ్ ఘాటుగా బదులిచ్చాడు. ప్రపంచ కప్(ind vs pak world cup 2021) లాంటి మెగా టోర్నీల్లో భారత్‌తో మ్యాచ్ ఉంటే.. పాకిస్థాన్ జట్టు ఈసారి కచ్చితంగా చరిత్ర సృష్టిస్తామని గొప్పలు చెబుతూ కాలం వెల్లదీస్తుందని విమర్శించాడు. కానీ, టీమ్ఇండియా ఆటగాళ్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ప్రాక్టీసులో నిమగ్నమై ఉంటారని పేర్కొన్నాడు. ఆ కారణంగానే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ సంపూర్ణ ఆధిక్యం చెలాయిస్తోందని తెలిపాడు.
T20 WorldCup 2021: 'భారత్ కంటే పాక్ మెరుగ్గా కనిపిస్తోంది' - వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్థాన్
పాకిస్థాన్ జట్టులా టీమ్ఇండియా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోదని తెలిపాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్(sehwag news). ప్రస్తుత పరిస్థితుల ప్రకారం భారత్ కంటే పాకిస్థాన్(ind vs pak world cup 2021) మెరుగ్గా కనిపిస్తుందని వెల్లడించాడు.
"ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉండటం వల్ల.. 2003, 2011 ప్రపంచకప్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలిగాం. మేమెప్పుడూ సానుకూల వైఖరితోనే ఆడతాం. ('ఈ సారి మేం చరిత్ర సృస్టించబోతున్నాం' అన్న యాంకర్ మాటలను ఉద్దేశించి). అంతేకాని పాకిస్థాన్‌లా గొప్పలు చెబుతూ కూర్చోం. టీమ్ఇండియా ఎప్పుడూ అలాంటి ప్రకటనలు చేయదు. మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా సంసిద్ధమైతే ఫలితాలు అవే వస్తాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే.. టీ20ల్లో(ind vs pak world cup 2021) పాకిస్థాన్ మెరుగ్గా కనిపిస్తోంది. అందుకే, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది. ఎందుకంటే ఇది 50 ఓవర్ల మ్యాచ్ కాదు.. పొట్టి క్రికెట్లో ఒక్క ఆటగాడు రాణించినా మ్యాచ్ ఫలితాలు తారుమారు అయిపోతాయి. అయితే, పాకిస్థాన్ ఇప్పటివరకు అలా చేయలేకపోయింది. చూద్దాం.! అక్టోబరు 24న ఏం జరుగుతుందో" అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
భారత్-పాకిస్థాన్(ind vs pak world cup 2021) జట్లు తలపడిన ప్రతిసారి ఈసారి ఎవరు గెలుస్తారనే విషయంపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈసారైనా భారత్‌పై పాకిస్థాన్ గెలుస్తుందా.? లేక ప్రపంచకప్‌లో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా.? అన్న చర్చ నడుస్తూనే ఉంటుంది. అయితే, ఐసీసీ ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు పాకిస్థాన్ జట్టు టీమ్ఇండియాను ఓడించలేదు. 2007లో టీ20 ప్రపంచకప్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్-పాక్ జట్లు 5 సార్లు తలపడితే.. ఐదు సార్లు భారత్ విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఏడు సార్లు పోటీపడగా.. అన్నిసార్లు భారత జట్టే విజేతగా నిలిచింది. దీంతో ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ 12-0తో సంపూర్ణ ఆధిక్యంలో ఉంది.