Rahul Dravid Bowling in nets: భారత్-న్యూజిలాండ్ మధ్య జరగబోయే టెస్టు సిరీస్‌కు అంతా సిద్ధమైంది. గురువారం కాన్పుర్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి రెండు జట్లు. కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో భారత ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. ఈ క్రమంలోనే నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న బ్యాటర్లకు తన స్పిన్ బౌలింగ్‌తో సవాల్ విసిరాడు ద్రవిడ్. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయగా.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
నెట్స్‌లో ద్రవిడ్ బౌలింగ్.. స్పిన్‌తో మాయాజాలం! - రాహుల్ ద్రవిడ్ న్యూజిలాండ్ తొలి టె్సటు
భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు(IND vs NZ first test) కాన్పుర్ వేదికగా గురువారం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి ఇరుజట్లు. కాగా, నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న భారత బ్యాటర్లకు తన స్పిన్ బౌలింగ్‌తో సవాల్ విసిరాడు కోచ్ రాహుల్ ద్రవిడ్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
![నెట్స్‌లో ద్రవిడ్ బౌలింగ్.. స్పిన్‌తో మాయాజాలం! Rahul Dravid bowling, Rahul Dravid bowling in nets, ద్రవిడ్ బౌలింగ్, నెట్స్‌లో ద్రవిడ్ బౌలింగ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13723986-304-13723986-1637753279019.jpg)
Rahul Dravi
ఈ మ్యాచ్(IND vs NZ first test)కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పంత్, షమీ, బుమ్రాలకు విశ్రాంతినిచ్చింది యాజమాన్యం. కేఎల్ రాహుల్ గాయంతో సిరీస్ నుంచి వైదొలిగాడు. దీంతో తొలి టెస్టుకు అజింక్యా రహానె కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. పుజారా వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. స్టార్ ఆటగాళ్లు లేకపోవడం వల్ల మయాంక్ అగర్వాల్, గిల్, శ్రేయస్ అయ్యర్ల బ్యాటింగ్‌పై అందరి దృష్టి నెలకొంది.