తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్ఇండియా కిట్ స్పాన్సర్​గా 'అడిడాస్'.. ఒక్కో మ్యాచ్​కు రూ.65 లక్షలు చెల్లించాల్సిందే! - ipl 2023 playoffs

అంతర్జాతీయ స్పోర్ట్స్​ బ్రాండ్​ 'అడిడాస్' ఇక నుంచి టీమ్​ఇండియాకు కిట్​ స్పాన్సర్​గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

team india new sponcer
టీమ్ఇెండియా కొత్త స్పాన్సర్

By

Published : May 22, 2023, 3:21 PM IST

Updated : May 22, 2023, 4:47 PM IST

టీమ్ఇండియా కొత్త కిట్ స్పాన్సర్‌గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్ 'అడిడాస్'తో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. క్రీడా సంబంధిత వస్తువులు ఉత్పత్తి చేసే అడిడాస్‌తో త్వరలోనే జతకట్టనున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఈ ఒప్పందం జూన్‌ 1 నుంచి అమలులోకి రానుందని తెలిపారు. అయితే టీమ్​ఇండియాకు ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ 2020 నుంచి 2023 డిసెంబర్‌ వరకు భారత జట్టుకు కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించాల్సి ఉంది. గతేడాది డిసెంబరులో ఎంపీఎల్ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంది. కాగా అప్పటి నుంచి తాత్కాలికంగా కిల్లర్​ జీన్స్​ స్పాన్సర్​గా వ్యవహరిస్తోంది. ఈ నెల 31తో ఆ ఒప్పందం ముగియనుంది. 'టీమ్ఇండియా కిట్ స్పాన్సర్​గా బీసీసీఐ 'అడిడాస్'తో ఒప్పందం కుదిరింది. ప్రపంచంలోనే ప్రముఖ స్పోర్ట్స్ వస్తువుల బ్రాండ్​లో ఒకటైన అడిడాస్​తో కలిసి పని చేయటానికి సిద్ధంగా ఉన్నాం. క్రికెట్‌ క్రీడ అభివృద్ధికి మేము ఎల్లప్పుడు కట్టుబడి ఉంటాము. వెల్‌కమ్‌ అడిడాస్‌' అని జై షా ట్వీట్‌ చేశారు.

ఒప్పంద ప్రక్రియ..అడిడాస్​తో ఒప్పందం ఐదేళ్లపాటు ఉండనున్నట్లు తెలుస్తోంది. జూన్ 2023 నుంచి ఈ ఒప్పందం అమలులోకి రానుంది. 2028 వరకు అడిడాస్.. టీమ్ఇండియాతో కొనసాగనునుంది. ఈ అగ్రిమెంట్​లో భాగంగా స్పాన్సర్​గా ఉండనున్న అడిడాస్.. ఒక్కో మ్యాచ్‌కు రూ.65 లక్షలు దాకా బీసీసీఐకు చెల్లించనుంది. ఈ లెక్కన ప్రతి ఏడాది అన్ని ఫార్మాట్లలో మ్యాచ్​లు కలుపుకొని సుమారు రూ.70 కోట్లు చెల్లించేందుకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. అంటే ఐదు సంవత్సరాల కాలానికి రూ.350 కోట్లు దాటవచ్చని అంచనా. అడిడాస్ కంటే ముందు టీమ్ఇండియాకు 2015 నుంచి 2020 మధ్య కాలంలో మరో ప్రముఖ స్పోర్ట్స్ సంస్థ 'నైక్‌' కిట్‌ స్పాన్సర్‌గా వ్యహరించింది. జూన్​ 7-11 తేదీల్లో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్ మ్యాచ్​ నుంచే అడిడాస్ స్పాన్సర్​షిప్ అమలుకానుంది.

ఇకపోతే ఆదివారంతో ఐపీఎల్ 16వ సీజన్ లీగ్ మ్యాచ్​లు ముగిశాయి. టోర్నీ నుంచి నిష్క్రమించిన జట్ల ఆటగాళ్లలో.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడాల్సిన ప్లేయర్లు కోచ్​ ద్రవిడ్​తో కలిసి ఈ వారమే ఇంగ్లాండ్ వెళ్లనున్నారు. వీరిలో కోహ్లీ, అశ్విన్, అక్షర్ పటేల్, శర్దూల్ ఠాకూర్, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్ ఉన్నారు. ఇక ముంబయి ప్లే ఆఫ్స్ చేరినందున కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త ఆలస్యంగా జట్టుతో కలవనున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్ ముగిసిన తర్వాత జులైలో టీమ్ఇండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కరీబియన్ జట్టుతో భారత్ రెండు టెస్టులు, మూడేసి వన్డే, టీ20 మ్యాట్​లు ఆడాల్సి ఉండగా.. ఆ షెడ్యూల్ పై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఇవీ చదవండి:

Last Updated : May 22, 2023, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details