Team India Future Plan :టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చారు. టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్ చేరినా తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో ఛాంపియన్‌గా నిలువకపోయినా వైట్ బాల్ (లిమిటెడ్ ఓవర్లు) క్రికెట్లో టీమ్ఇండియా అత్యుత్తమ జట్టని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరి జట్టు ఇంత బలంగా అవ్వడానికి కారణమెవరు? ఇదంతా ఒక్క రోజులో జరిగిందా? అయితే టీమ్ఇండియా అత్యుత్తమ జట్టుగా మారడానికి బీసీసీఐ, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ఎంతగానో తోడ్పడ్డాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని సెలెక్షన్ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో జట్టుకు బలమైన పునాది వేయడంలో మున్ముందు కూడా ఎన్సీఏ పాత్ర కీలకం కానుంది.
అయితే ప్రస్తుతం బోర్డు, రాబోయే రోజుల్లో టీమ్ఇండియా ఆడనున్న టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్‌లపై దృష్టి సారించింది. భవిష్యత్‌లో భారత్ ఆడనున్న క్రికెట్ జట్టు ఎంపికకై ఐదుగురు సెలెక్షన్ అధికారులు, ఎన్సీఏతో చర్చించనున్నారు. ఈ ఎంపికపై బీసీసీఐ అధికారి ఒకరు ఈటీవీ భారత్‌తో మాట్లాడారు.