Team India Shedule 2022: మరో ఏడాది ముగిసింది. కరోనా కష్టకాలంలోనే బయోబబుల్ సాయంతో పలు టోర్నీలు ఈసారి క్రీడాభిమానులకు కనువిందు చేశాయి. టీమ్ఇండియా కూడా వరుస ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐపీఎల్, టీ20 ప్రపంచకప్‌తో తీరక లేకుండా గడిపింది. అయితే 2021లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయని చెప్పొచ్చు. ఆస్ట్రేలియా చారిత్రక టెస్టు సిరీస్ గెలిచాక.. మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది కోహ్లీసేన. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. అయితే ఈ ఏడాది కూడా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈసారైనా ఐసీసీ ట్రోఫీ దాహాన్ని భారత జట్టు తీర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భారత్ ఆడబోయే మొత్తం టోర్నీలు ఏంటో చూద్దాం.
Note: ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్ఇండియా జనవరి 23 వరకు అక్కడే ఉండనుంది.
భారత్ పర్యటనకు వెస్టిండీస్