బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా.. తొలి రెండు టెస్ట్ మ్యాచుల్లో ఓటమిపాలైంది. టీమ్ఇండియాను సొంతగడ్డపైనే ఓడించి సిరీస్ తీసుకెళ్తామని చెప్పిన ఆసీస్.. కనీసం మిగిలిన రెండు టెస్టులను గెలిస్తేనే సిరీస్‌ను సమం చేసే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్ పోనుంది. మరోవైపు, గాయాల రూపంతోపాటు వ్యక్తిగత పనుల నిమిత్తం ఆటగాళ్లు జట్టును వీడటం ఆసీస్‌ను దెబ్బ తీసేలా ఉంది. ఇప్పటికే కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, జోష్ హేజిల్‌వుడ్ దూరమయ్యారు. దీంతో మూడో టెస్టు మ్యాచ్‌కు స్టీవ్‌స్మిత్ సారథ్యం వహించనున్నాడు.
'ఆసీస్ క్రికెట్ మేనేజర్.. ఏదో ఒకటి చేయ్ బాస్.. లేకుంటే మీ జట్టు పొట్లమే'
టీమ్ఇండియాపై గెలవాలంటే ప్రత్యేకంగా ఏదైనా చేయాలని ఆసీస్‌కు టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ సూచించాడు. లేకపోతే నవ్వుల పాలుకాక తప్పదని సున్నితంగా హెచ్చరించాడు. ఇంకేమన్నాడంటే?
ఈ నేపథ్యంలో టీమ్ఇండియాపై గెలవాలంటే 'ప్రత్యేకంగా ఏదైనా చేయాలి' అని ఆసీస్‌కు టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ సూచించాడు. లేకపోతే నవ్వుల పాలుకాక తప్పదని సున్నితంగా హెచ్చరించాడు. "ఇది ఆసీస్ క్రికెట్ మేనేజర్‌కు చెబుతున్నా.. భారత్‌పై గెలవాలంటే 'ఏదో ఒకటి చేయ్ బాస్'.. సిరీస్‌పై భారీ స్థాయిలో అంచనాలు ఉండేవి. నేను ఇంగ్లీష్‌లోనే చెప్పేందుకు ప్రయత్నిస్తా. ఏదొకటి మీరు చేయాలి. లేకపోతే మీ జట్టు 'పొట్లం' అయిపోతుంది. ఇతర జట్ల ముందు నవ్వులపాలు కాక తప్పదు" అని క్రిష్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడాడు.
కాగా, మార్చి 1 నుంచి ఇందోర్ వేదికగా భారత్ - ఆసీస్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం మన సొంతమవుతుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కూ దూసుకెళ్తుంది.