విరాట్ కోహ్లీ(Virat Kohli) సారథ్యంలోని టీమ్‌ఇండియా(Team India) ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. న్యూజిలాండ్తో జరిగిన టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) ఓడిపోయాక.. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు మధ్యలో మరో ఆరు వారాల సమయం ఉంది. అన్ని రోజుల పాటు బయో బుడగలో ఉండటం కష్టం. అందులోనూ ఆటగాళ్లు మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో వారిని ఉల్లాసంగా ఉంచేందుకు మూడు వారాల పాటు టీమ్‌ఇండియా క్రికెటర్లకు విరామం ఇచ్చారు. బుడగ నుంచి బయటకు వెళ్లి గడిపేందుకు అనుమతి ఇచ్చారు. జట్టులోని చాలామందికి బ్రిటన్‌లోని ప్రాంతాలతో పరిచయం ఉంది. సారథి విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మ(Anushka Sharma)తో కలిసి ఓ కెఫేకు వెళ్లి చక్కని కాఫీని ఆస్వాదించాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలను వీరిద్దరూ ఇన్‌స్టాలో పంచుకున్నారు.