టీమ్ఇండియా(Team India) రెండు రోజుల్లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final) న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇప్పటికే సౌథాంప్టన్‌లోని ఏజీయస్ మైదానంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతూ తుదిపోరుకు తీవ్రంగా సాధన చేస్తోంది. కాగా, పలువురు క్రికెటర్లు ఓ ర్యాపిడ్ ఫైర్ కంటెస్ట్‌లో పాల్గొన్నారు. ఆ వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. అది కాస్తా నవ్వులు పూయిస్తోంది. అందులో వైస్ కెప్టెన్ అజింక్య రహానె(Ajinkya Rahane), సీనియర్ పేసర్లు ఇషాంత్ శర్మ(Ishant Sharma), మహ్మద్ షమీ, టెస్టు స్పెషలిస్టు చేతేశ్వర్ పుజారా, స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ ఇలా ఐదు మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని మూడు ప్రశ్నలు అడగ్గా.. అందులో ఒకటి బాలీవుడ్‌కు సినిమాలకు సంబంధించినవి అడిగారు. దానికి సమాధానాలు చెప్పలేక ఈ టీమ్‌ఇండియా క్రికెటర్లు కాస్త ఇబ్బందులు పడ్డారు.
ఇంగ్లాండ్‌లో మీకిష్టమైన అల్పాహారం?
జవాబు: అందరూ ఉడకబెట్టిన గుడ్లు, బేక్డ్ బీన్స్ అని పేర్కొనగా.. పుజారా మాత్రం వెజిటేరియన్ అని చెబుతూ.. బ్రౌన్‌టోస్ట్, ఆలూ టోస్ట్, బీన్స్ అని సమాధానమిచ్చాడు.
లండన్‌లో తీసిన మూడు బాలీవుడ్ సినిమా పేర్లు?
ఇషాంత్: నమస్తే లండన్, క్వీన్ , దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే
అశ్విన్:నమస్తే లండన్, కల్‌హోనహో..
రహానె:దిల్‌వాలే అందరికీ తెలిసిందే, ఇంకోటి హౌస్‌ఫుల్.