Shardul Thakur Marriage: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు అయిన మిథాలీ పారుల్కర్‌ను శార్దూల్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న వివాహం చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని మిథాలీ స్వయంగా వెల్లడించింది. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ జంటకు గతేడాది నవంబరులో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
పెళ్లి పీటలెక్కనున్న టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్.. అమ్మాయి ఎవరో తెలుసా? - శార్దూల్ ఠాకూర్ వివాహ వేడుకలు
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తన చిరకాల స్నేహితురాలు మిథాలీని పెళ్లి చేసుకోనున్నాడు. ఇంతకీ పెళ్లి ఎప్పుడంటే?
Shardul Thakur Marriage:
ఫిబ్రవరి 24 వరకు శార్దూల్‌కు బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల, పెళ్లి ముహుర్తం 27న నిర్ణయించినట్లు మిథాలీ వివరించింది. వివాహ వేడుకలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమవుతాయని, ముంబయికి సమీపంలోని కర్జత్‌లో మహారాష్ట్ర పద్ధతిలో వీరి వివాహం జరగుతుందని ఆమె తెలిపింది. మిథాలీ పారుల్కర్ ఎంట్రప్రెన్యూర్.. మోడలింగ్ కూడా చేసింది. ప్రస్తుతం బేకింగ్ స్టార్టప్‌ని నిర్వహిస్తోంది.