Bhuvneshwar Kumar Baby: టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఇతడి భార్య నుపుర్ నగర్ బుధవారం ఉదయం 9 గంటలకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భువీ సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశాడు.
తండ్రిగా ప్రమోషన్ పొందిన పేసర్ భువనేశ్వర్ - నుపుర్ నగర్ ఆడబిడ్డ
టీమ్ఇండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తండ్రయ్యాడు. ఇతడి సతీమణి నుపుర్ నగర్ బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
మంగళవారం వీరిద్దరూ తమ నాలుగో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ క్రమంలో నేడు ఉదయం పురుటి నొప్పులు రాగా నుపుర్ను దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. కాసేపటికే ఆమె బిడ్డకు జన్మనివ్వగా.. వారి కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది.
ఈ ఏడాది మే 20న భువనేశ్వర్ కుమార్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ అనారోగ్యంతో మృతిచెందారు(bhuvneshwar kumar father passed away). ఆ సమయంలో వారి కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను అనుభవించిన వీరి కుటుంబంలోకి తాజాగా ఆడబిడ్డ రాగా.. ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.