Rohith Sharma Asia Cup: యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి జరగనున్న ఆసియకప్‌కు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. భారత తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆగస్టు 27న దుబాయ్ వేదికగా తలపడనుంది. కాగా ఆసియా కప్‌కు ముందు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.
ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో 971 పరుగులతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ తొలి స్థానంలో ఉన్నాడు. ఇక 883 పరుగులతో రెండో స్థానంలో రోహిత్.. మరో 89 పరుగులు సాధిస్తే సచిన్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంటాడు. అదే విధంగా రోహిత్ మరో 117 పరుగులు చేస్తే ఆసియా కప్‌లో 1000 పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలుస్తాడు. దాంతో పాటు ఆసియాకప్‌లో వెయ్యి పరుగుల సాధించిన వారి జాబితాలో రోహిత్ మూడో స్థానానికి చేరుకుంటాడు.