తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ ఇండియాకు షాక్​.. కెప్టెన్​ రోహిత్​ శర్మకు కరోనా - రోహిత్​ శర్మకు కరోనా పాజిటివ్​

ఇంగ్లాండ్​తో ఐదో టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్న భారత జట్టుకు భారీ షాక్​ తగిలింది. టీమ్​ ఇండియా సారథి రోహిత్​ శర్మకు కరోనా పాజిటివ్​గా తేలినట్లు బీసీసీఐ ప్రకటించింది.

Rohit sharma
కెప్టెన్​ రోహిత్​ శర్మకు కరోనా

By

Published : Jun 26, 2022, 5:02 AM IST

Updated : Jun 26, 2022, 7:12 AM IST

ఇంగ్లాండ్​ పర్యటకు వెళ్లిన టీమ్​ ఇండియాకు భారీ షాక్​ తగిలింది. కెప్టెన్​ రోహిత్​ శర్మకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ మేరకు జూన్​ 25న శనివారం నిర్వహించిన రాపిడ్​ యాంటిజెన్​ పరీక్షలో పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు బీసీసీఐ తెలిపింది. గతేడాది నిలిచిపోయిన ఐదో టెస్టు ప్రారంభానికి ముందు హిట్​మ్యాన్​ కరోనా బారిన పడటం జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ప్రస్తుతం అతడు టీమ్‌ బస చేసిన హోటల్‌లోనే ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉన్నాడని, బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు రోహిత్‌ ప్రస్తుతం లీసెస్టర్‌ జట్టుతో జరుగుతోన్న వార్మప్‌ మ్యాచ్‌లో గురువారం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసి 25 పరుగులు చేశాడు. కానీ, శనివారం రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా బ్యాటింగ్‌కు రాలేదు. ఈ క్రమంలోనే అతడికి పాజిటివ్‌గా తేలడంతో ఇరు జట్లలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. కాగా, గతేడాది పూర్తికావాల్సిన 5 టెస్టుల సిరీస్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడాక కరోనా కేసుల కారణంగానే వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే టెస్టుకు ముందు పలువురు భారత ఆటగాళ్లు కొవిడ్‌-19 బారిన పడటం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. అయితే, అతడు ఈ టెస్టుకు ముందు కోలుకుంటే కెప్టెన్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. రోహిత్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఇదీ చూడండి:కోహ్లీ, రోహిత్ ఇద్దరే ఉన్నారు.. ఆ పని మళ్లీ చేస్తారా?

Last Updated : Jun 26, 2022, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details