తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రెండే కాదు.. టీమ్​ఇండియా మూడు జట్లను కూడా' - ఎంఎస్ ధోనీ

రెండు కాదు ఏక కాలంలో మూడు జట్లతో అంతర్జాతీయ సిరీస్​లు ఆడే సత్తా భారత్ సొంతమని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్ సంస్కృతి చాలా బలంగా ఉందని తెలిపాడు.

Kamran Akmal
కమ్రాన్ అక్మల్

By

Published : May 29, 2021, 3:47 PM IST

Updated : May 30, 2021, 9:05 AM IST

ఏక కాలంలో మూడు జట్లను బరిలోకి దించే సత్తా భారత్​ సొంతమని పాకిస్థాన్ మాజీ​ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్​ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం భారత్​ క్రికెట్ చాలా పటిష్ఠంగా ఉందని తెలిపాడు.

"భారత్ త్వరలో రెండు జట్లను బరిలోకి దించుతోంది. ఈ ఘనత అంతా టీమ్​ఇండియాదే. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరనుండగా.. మరొక టీమ్ శ్రీలంక టూర్​కు వెళ్లనుంది. ఏక కాలంలో రెండు జట్లతో రెండు సిరీస్​ల్లో పాల్గొననుంది. వారి క్రికెట్​ సంస్కృతి చాలా బలంగా ఉంది. రెండు కాదు మూడు జట్లను కూడా ఫీల్డ్​లోకి దించగల సత్తా టీమ్ఇండియాకు ఉంది. ప్రారంభ స్థాయి నుంచి దృఢమైన ఆటగాళ్లు ఉండటమే ఇందుకు కారణం."

-కమ్రాన్ అక్మల్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్

"యువ క్రికెటర్లకు రాహుల్ ద్రవిడ్ మంచి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఆయన గత కొద్ది సంవత్సరాలుగా చాలా మంది క్రికెటర్లను తయారు చేశాడు. కోచ్​ రవిశాస్త్రి కూడా జట్టుకు అద్భుతంగా గైడ్ చేస్తున్నాడు. మాజీ కెప్టెన్ ధోనీ నాయకత్వాన్ని ప్రస్తుత సారథి కోహ్లీ మంచిగా అందిపుచ్చుకున్నాడు. విరాట్ అందుబాటులో లేకపోతే ఆ బాధ్యతలు రోహిత్ చూసుకుంటాడు. అతడు గాయపడితే కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు. ఇలా చాలా మంది క్రికెటర్లు ఉన్నారు. ఒకవేళ ఇండియా-సీ టీమ్​ను శ్రీలంక పర్యటనకు పంపినా.. అది గెలుస్తుంది" అని అక్మల్ తెలిపాడు.

ఇదీ చదవండి:ipl 2021: యూఏఈ వేదికగా ఐపీఎల్​ రెండో దశ

Last Updated : May 30, 2021, 9:05 AM IST

ABOUT THE AUTHOR

...view details