తెలంగాణ

telangana

ETV Bharat / sports

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానం ఎంతంటే? - ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్ల పట్టిక

న్యూజిలాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది టీమ్ఇండియా. తద్వారా ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ రెండో ఎడిషన్​ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది.

IND vs NZ test, WTC 2021-23 Points Table:WTC 2021-23 Points Table, ప్రపంచ ఛాంపయన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్
IND vs NZ

By

Published : Dec 6, 2021, 12:56 PM IST

WTC 2021-23 Points Table: న్యూజిలాండ్​తో జరిగిన రెండో టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. తద్వారా 1-0 తేడాతో సిరీస్​నూ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ రెండో ఎడిషన్​ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. తాజాగా కివీస్​తో సిరీస్​ను 1-0 తేడాతో గెలుచుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో 42 పాయింట్లు, 58.33 పర్సంటేజ్​తో మూడో స్థానంలో నిలిచింది. 2021-23 ఎడిషన్​లో తొలి టెస్టు సిరీస్ ఆడిన న్యూజిలాండ్ 4 పాయింట్లు, 16.66 పర్సంటేజ్​తో 6వ స్థానానికి చేరుకుంది. శ్రీలంక 100 పర్సంటేజ్, 24 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పాకిస్థాన్ 66.66 పర్సంటేజ్​తో రెండో స్థానం కైవసం చేసుకుంది.

WTC 2021-23 Points System: డబ్ల్యూటీసీ-2 ​(2021-2023) కోసం కొత్త పాయింట్ల పద్ధతిని ఇదివరకే ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్ ​(ఐసీసీ). పర్సెంటేజ్​ ఆఫ్​ పాయింట్ల ప్రకారం జట్లకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు తెలిపింది. గెలిచిన ప్రతి మ్యాచ్​కు 12 పాయింట్లు వస్తాయని వెల్లడించింది.

ఈ కొత్త పద్ధతి ప్రకారం గెలిచిన ప్రతి మ్యాచ్​కు 12 పాయింట్లు, పర్సెంటేజ్​ రూపంలో 100 పాయింట్లు ఇస్తారు. టై అయితే (6 పాయింట్లు, 50 శాతం), డ్రా (4 పాయింట్లు, 33.33 శాతం), ఓడిన మ్యాచ్​కు (0 పాయింట్లు, 0 శాతం) ఉంటాయి. మ్యాచ్​ల సంఖ్య ఆధారంగా సిరీస్​ పాయింట్లను కేటాయిస్తారు.

ఇవీ చూడండి: IND vs NZ TEST: ఈ రికార్డులు బద్దలు.. అవేంటంటే?

ABOUT THE AUTHOR

...view details