ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం భారత జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఆసీస్ గడ్డపై రాణించిన బ్రిస్బేన్ టెస్టు హీరో శార్దుల్ ఠాకుర్‌కు మొండి చేయి చూపించింది బోర్డు. అతని స్థానంలో 15వ ఆటగాడిగా ఉమేష్ యాదవ్‌కు జట్టులో స్థానం కల్పించింది.
శార్దుల్‌తో పాటు ఓపెనర్ మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్‌కు స్క్వాడ్‌లో చోటు దక్కలేదు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో రాణించిన స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టింది. జడేజా, అశ్విన్‌ను జట్టులోకి తీసుకోవడం వల్ల అక్షర్‌కు స్థానం లభించలేదు.
ఇక ఓపెనర్లుగా రోహిత్, గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. ఐసీసీ నిబంధనల ప్రకారం 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇద్దరు కీపర్లను ఎంపిక చేయడానికి కూడా కారణం అదే. పంత్, సాహాలలో ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా బ్యాకప్ కీపర్‌గా మరొకరు జట్టుతో కొనసాగుతారు.