తెలంగాణ

telangana

ETV Bharat / sports

నా సూపర్ ఫామ్​కు కారణం అతడే: అక్షర్​ పటేల్​ - బోర్డర్‌ వస్కర్‌ ట్రోఫీ 2023

ఆస్ట్రేలియా​తో జరిగిన తొలి టెస్టులో అర్దసెంచరీతో చెలరేగిన ఆల్​రౌండర్​ అక్షర్ పటేల్​.. రెండో టెస్టులోనూ జట్టును ఆదుకున్నాడు. ఆసీస్ బౌలర్ల ధాటికి టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు క్రీజులో నిలవలేక ఇబ్బంది పడితే.. అక్షర్‌ మాత్రం తన బ్యాట్​తో అదరగొట్టాడు. అయితే తన సూపర్​ ఫామ్​కు కారణం ఓ దిగ్గజ క్రికెటర్​ అని తెలిపాడు. అతడెవరంటే?

team India all rounder akhara Patel
team India all rounder akhara Patel

By

Published : Feb 19, 2023, 10:13 AM IST

ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా దిల్లీ వేదికగా ఆసీస్​తో జరుగుతున్న రెండో టెస్ట్​లో టీమ్​ఇండియా ఆల్​రౌండర్ అక్షర్​ పటేల్​ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కంగారుల బౌలర్ల ధాటికి వరుసగా బ్యాటర్లు వరుసగా పెవిలియన్​ చేరుతున్న సమయంలో.. అక్షర్ 115 బాల్స్‌లో మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 74 ర‌న్స్ చేసి కీలక ఇన్నింగ్స్​ ఆడాడు. రవిచంద్రన్​ ఆశ్విన్​ ఐదు ఫోర్లుతో 31 పరుగుల చేశాడు. వీరిద్దరి కీలక ఇన్నింగ్స్​ ఫలితంగా భారత్‌ 263 పరుగులకు ఆలౌటైంది. అయితే మ్యాచ్​ అనంతరం మీడియాతో మాట్లాడిన అక్షర్​ పటేల్​ తన బ్యాటింగ్​ స్కిల్స్​ మెరుగుపడడంలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్​ రికీ పాంటింగ్ కీలక పాత్ర ఉందని అన్నారు.

"ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నా బ్యాటింగ్‌ స్కిల్స్‌ మెరుగుపడడంలో పాంటింగ్​ ముఖ్య పాత్ర పోషించాడు. చాలా మంది టీమ్​ఇండియా బ్యాటర్ల నుంచి కూడా మరికొన్ని టెక్నిక్స్​ నేర్చుకున్నాను. నేను ఏ జట్టులో ఆడినా.. దానిపై 100 శాతం కృషి చేస్తాను. ఆల్‌రౌండర్‌గా బ్యాటింగ్​, బౌలింగ్​లో రాణించడమే నా లక్ష్యం. జట్టులో నేను సాధించే 30, 40 పరుగులను మ్యాచ్ విన్నింగ్ స్కోర్‌లుగా మార్చాలనుకున్నాను. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా నా ఆలోచన ఈ విధంగానే ఉంటుంది"

-- అక్షర్​ పటేల్, టీమ్​ఇండియా ఆల్​రౌండర్

భారత బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టిన ఆసీస్​ స్పిన్నర్ల బౌలింగ్‌లోనే అక్షర్​ భారీ షాట్లతో చెలరేగాడు. ముఖ్యంగా కునెమన్‌ బౌలింగ్‌లో ఆఫ్‌ సైడ్‌ కొట్టిన ఫ్లాట్‌ సిక్సర్‌ రెండో రోజు ఆటకే హైలైట్‌. అతడు మిడాన్‌లోనూ కళ్లు చెదిరే రెండు సిక్సర్లు బాదాడు. అశ్విన్‌ సైతం నిలకడగా బ్యాటింగ్‌ చేయడం వల్ల భారత్‌ స్కోరు 200 దాటింది. ఆ తర్వాత అక్షర్‌, అశ్విన్‌ల జోడీ కూడా వందకు పైగా పరుగులు చేసింది. భారత్‌ 253/7తో ఆధిక్యం మీద కన్నేసింది. కానీ అశ్విన్‌ను కమిన్స్‌ ఔట్‌ చేయగానే.. భారత్‌ ఉన్నట్లుండి మిలిగిన ఆ రెండు వికెట్లను కూడా కోల్పోయి ఆలౌటైంది. అక్షర్‌ కూడా కాసేపటికే వెనుదిరిగాడు. షమీ(2)ని కునెమన్‌ బౌల్డ్‌ చేయడంతో ఆసీస్‌ స్కోరుకు ఒక్క పరుగు దూరంలో భారత్‌ ఆగిపోయింది.

ABOUT THE AUTHOR

...view details