తెలంగాణ

telangana

ETV Bharat / sports

పొట్టి కప్, ఎన్నో సిరీస్​లు- 2024లో ఫుల్ మజా- భారత్ పూర్తి షెడ్యూల్ ఇదే! - టీమ్ఇండియా 2024 షెడ్యూల్

Team India 2024 Schedule: టీమ్ఇండియ గతేడాది అన్ని ఫార్మాట్​లలో అద్భుతంగా రాణించింది. 35 వన్డేల్లో 27, 23 టీ20ల్లో 15 మ్యాచ్​ల్లో గెలిచి సత్తా చాటింది. ఇక టెస్టుల్లో 8 మ్యాచ్​ల్లో 3 నెగ్గి, 3 గేమ్స్​లో ఓడింది. ఇక రెండింటిని డ్రా చేసుకుంది. ఇక 2024లో టీమ్ఇండియ ఆడనున్న సిరీస్​ల పూర్తి షెడ్యుల్​పై ఓ లుక్కేయండి.

team india 2024 schedule
team india 2024 schedule

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 10:32 AM IST

Team India 2024 Schedule:గతేడాది అన్ని ఫార్మాట్​లలో టీమ్ఇండియా అద్భుతంగా ఆడింది. ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్​​లోనూ నెం.1 స్థానాన్ని దక్కించుకుంది టీమ్ఇండియా. అయితే ఎన్ని విజయాలు సాధించినా డబ్ల్యూటీసీ, వన్డే వరల్డ్​కప్ ఫైనల్స్​లో ఓటమి క్రికెట్ ఫ్యాన్స్​ను కలచివేసింది. దీంతో ఐసీసీ ట్రోఫీ నిరీక్షణ 12 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. అయితే 2024లో ఐసీసీ టీ20 వరల్డ్​కప్ జరగనుంది. ఈ టోర్నమెంట్​లోనైనా రాణించి టైటిల్ పట్టేయాలని టీమ్ఇండియా భావిస్తోంది.

పొట్టి ప్రపంచకప్​తోపాటు టీమ్ఇండియా ఆయా దేశాలతో ద్వైపాక్షిక సిరీస్​లు ఆడనుంది. గతేడాది తప్పిదాలను సరిచేసుకొని, కొత్త సంవత్సరంలో మరింత మెరుగ్గా రాణించాలని టీమ్ఇండియా ఫ్యాన్స్​ఆశిస్తున్నారు. మరి ఈ ఏడాది టీమ్ఇండియా పర్యటనలు ఏంటి? ఏయే దేశాలతో ఏయే ఫార్మాట్ క్రికెట్ ఆడనుంది? ఎప్పుడెప్పుడు ఆ మ్యాచ్​లు జరగనున్నాయి. పూర్తి షెడ్యూల్ చూసేయండి.

జనవరి

  • జనవరి 3 నుంచి 7 వరకు సౌతాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్ .
  • స్వదేశంలో అఫ్గానిస్థాన్​తో 3 మ్యాచ్​ల టీ 20 సిరీస్. ఈ సిరీస్ జనవరి 11 నుంచి 17 వరకు జరగనుంది.
  • ​భారత్- ఇంగ్లాండ్ 5 మ్యాచ్​ల టెస్టు సిరీస్. జనవరి 25 నుంచి మార్చి 11 వరకు.

మార్చి- మే

  • మార్చి- మే మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉండనుంది.

జూన్

  • ఐసీసీ టీ20 వరల్డ్​కప్. వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికగా జూన్ 4 నుంచి 30 వరకు టోర్నీ జరగనుంది.

జూలై

  • భారత్, శ్రీలంక పర్యటనకు వెళ్తుంది. ఈ పర్యటనలో మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్, మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్ ఆడనుంది.

సెప్టెంబర్

  • శ్రీలంక పర్యటన తర్వాత సెప్టెంబర్​లో టీమ్ఇండియా స్వదేశంలో బంగ్లాదేశ్​తో ద్వైపాక్షిక సిరీస్​లో పాల్గొననుంది. రెండు టెస్టు, మూడు టీ20 మ్యాచ్​లు జరగనున్నాయి.

అక్టోబర్

  • భారత్- న్యూజిలాండ్ మధ్య స్వదేశంలో 3 టెస్టు మ్యాచ్​ల సిరీస్.

నవంబర్

  • ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్​తో టీమ్ఇండియా ఈ ఏడాదిని ముగిస్తుంది. కానీ ఈ సిరీస్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఈ సిరీస్ దాదాపు 2024 నవంబర్ - 2025 జనవరి మధ్యలోనే ఉండనుంది.

మేనేజ్​మెంట్​కు మాజీ క్రికెటర్ ప్రశ్న - 'టెస్టు జట్టుకు విరాట్ ఎందుకు నాయకత్వం వహించడం లేదు?'

టీమ్ఇండియాకు షాక్​ - శార్దూల్​కు గాయం!- రెండో టెస్ట్​కు డౌటే!

ABOUT THE AUTHOR

...view details