తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs ENG: రూట్​ సెంచరీ​.. టీ విరామానికి 314/5 - ఇండియా vs ఇంగ్లాండ్ టీ బ్రేక్

లార్డ్స్​ టెస్టు మూడో రోజు టీ విరామ సమయానికి ఆతిథ్య ఇంగ్లాండ్​ 5 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. క్రీజులో రూట్​(132*), మొయిన్​ అలీ​ (20*) పరుగులతో ఉన్నారు.

India vs England
ఇండియా vs ఇంగ్లాండ్

By

Published : Aug 14, 2021, 8:16 PM IST

Updated : Aug 14, 2021, 8:43 PM IST

లార్డ్స్​ టెస్టు మూడో రోజు టీ విరామ సమయానికి ఆతిథ్య ఇంగ్లాండ్​ 314/5 పరుగులు చేసింది. క్రీజులో రూట్​ (132*), మొయిన్​ అలీ​ (20*) పరుగులతో నిలిచారు. టీమ్ఇండియా బౌలర్లలో సిరాజ్​ 3, షమి, ఇషాంత్ తలో వికెట్ తీశారు.

216/3తో లంచ్​ విరామానికి వెళ్లిన ఇంగ్లాండ్​.. కాసేపటికే బెయిర్​ స్టో వికెట్​ను కోల్పోయింది. నాలుగో వికెట్​కు రూట్​తో కలిసి 121 పరుగులు జోడించిన బెయిర్​ స్టోను సిరాజ్​ పెవిలియన్​ పంపాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన జోస్​ బట్లర్​ సారథి రూట్​కు సహకరించాడు. ఐదో వికెట్​కు వీరిద్దరూ కలిసి 54 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను ఇషాంత్ విడదీశాడు. ఓ చక్కటి బంతితో బట్లర్​ను క్లీన్​ బౌల్డ్​గా వెనక్కి పంపాడు. అనంతరం క్రీజులోకి మొయిన్​ అలీ వచ్చాడు.

Last Updated : Aug 14, 2021, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details