IPL 2022: క్రికెట్ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఐపీఎల్-2022 మెగా వేలం మరికొద్ది రోజుల్లో జరగనుంది. అందరూ ఊహించినట్లే.. ఈనెల 12, 13 తేదీల్లో బెంగళూరులో ఈ మెగా వెలాన్ని నిర్వహిస్తున్నట్లు ఐపీఎల్ నిర్వహకులు అధికారికంగా వెల్లడించారు. ఉదయం 11 నుంచి వేలం పాట జరుగుతుందని, స్టార్‌స్పోర్ట్స్, డిస్నీ ప్లస్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నట్లు తెలిపారు. ఐపీఎల్‌తో ప్రముఖ చైనా మొబైల్ సంస్థ వీవో ఒప్పందం ఈ ఏడాదితో ముగిసిపోవడం వల్ల ఈసారి టాటా గ్రూప్ అధికారిక స్పాన్సర్‌షిప్ దక్కించుకుంది. దీంతో ఇకపై టాటా ఐపీఎల్‌గా దీన్ని వ్యవహరించనున్నారు.
ఇకపై ఇది 'టాటా ఐపీఎల్'.. వేలం తేదీలపై అధికారిక ప్రకటన - మెగా వేలం
IPL 2022: ఫిబ్రవరి 12, 13 తేదీల్లోనే ఐపీఎల్ మెగా వేలాన్ని నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు నిర్వాహకులు. ఇకపై దీనిని టాటా ఐపీఎల్‌గా వ్యవహరించనున్నారు.
ipl 2022
మరోవైపు ఈ మెగా వేలంలో పాల్గొనేందుకు మొత్తం 590 మంది క్రికెటర్లు పోటీపడుతున్నారు. అందులో 228 మంది అంతర్జాతీయ క్రికెటర్లు కాగా, మరో 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా ఉన్నారు. మరో ఏడుగురు అసోసియేట్ దేశాల క్రికెటర్లూ ఇందులో పాల్గొంటున్నారు. కాగా, ఈ ఏడాది రెండు కొత్త జట్లు చేరిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి అహ్మదాబాద్ టైటాన్స్ కాగా, రెండోది లఖ్‌నవూ సూపర్ జెయింట్స్.
ఇదీ చూడండి:IPL 2022: ప్రపంచకప్ గెలిచినా వేలానికి అనర్హులే! ఎందుకంటే..?