తెలంగాణ

telangana

ETV Bharat / sports

WPL 2023 హక్కులు కూడా టాటాకే.. ఎన్ని కోట్లో తెలుసా? - మహిళల ప్రీమియర్​ లీగ్​ లేటెస్ట్​

మహిళల ప్రీమియర్​ లీగ్​ టైటిల్​ హక్కులను టాటా గ్రూప్​ దక్కించుకుంది. మొత్తం ఐదేళ్లకు గాను టైటిల్​ స్పాన్సర్​షిప్ హక్కులు టాటాకు దక్కాయి. మార్చి 4 నుంచి డబ్ల్యూపీఎల్​ ప్రారంభం కానుంది.

tata group acquires women premier league title sponsership rights
tata group acquires women premier league title sponsership rights

By

Published : Feb 22, 2023, 6:43 AM IST

పురుషుల ఐపీఎల్​ టైటిల్​ హక్కులు అట్టిపెట్టుకున్న టాటా గ్రూప్​.. ఇప్పుడు వచ్చే నెలలో జరిగే మొట్టమొదటి మహిళల ప్రీమియర్​ లీగ్​ టైటిల్​ హక్కులు కూడా దక్కించుకుంది. మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే డబ్ల్యూపీఎల్​ హక్కులకు సంబంధించి బీసీసీఐ, టాటా సన్స్​ మధ్య ఒప్పందం కుదిరింది. మొత్తం ఐదేళ్ల పాటు టైటిల్​ స్పాన్సర్​షిప్ హక్కులు టాటాకు దక్కాయి. అయితే ఆ డీల్​ విలువ ఎంత అనేది ఇంకా బయటకు రాలేదు.

అయితే ఈ మహిళల ఐపీఎల్​ మీడియా హక్కులను వయాకామ్​ సంస్థ.. ఐదేళ్ల కాలానికి రూ.951 కోట్లకు దక్కించుకుంది. అంతకుముందు జట్టు ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు కూడా ప్రముఖ సంస్థలకు బీసీసీఐ ఆహ్వానాలు పంపింది. ఈ ఫ్రాంచైజీల అమ్మకం ద్వారా.. సుమారు రూ.4,670 కోట్లు బీసీసీఐ సంపాదించింది. ఐపీఎల్​లో ఉన్న మూడు ఫ్రాంచైజీలు ముంబయి ఇండియన్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్​.. మహిళల ఐపీఎల్​లో కూడా జట్లను కొన్నాయి.

వీరితో పాటు అదానీ గ్రూప్​, కాప్రి గ్లోబల్​ కూడా రెండు ఫ్రాంచైజీ హక్కులను దక్కించుకున్నాయి. కాగా, గుజరాత్​ జెయింట్స్​ ఫ్రాంచైజీ.. అత్యధికంగా రూ.1289 కోట్లకు అమ్ముడుపోయింది. ఆ తర్వాత స్థానాల్ల్లో ముంబయి ఇండియన్స్ (రూ.912.99 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ.901 కోట్లు), దిల్లీ క్యాపిటల్స్ (రూ.810 కోట్లు), యూపీ వారియర్స్ (రూ.757 కోట్లు) ఉన్నాయి.
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్​ ముగిసిన ఐదు రోజుల తర్వాత మహిళల ఐపీఎల్​ ప్రారంభమవ్వనుంది. కాగా, ఈ టోర్నీ కేవలం రెండు స్టేడియాల్లోనే బీసీసీఐ నిర్వహించనుంది. మొత్తం 22 మ్యాచ్​లు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details