తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tanmay Agarwal Captain: హైదరాబాద్ రంజీ జట్టు సారథిగా తన్మయ్

Tanmay Agarwal Captain: రంజీ ట్రోఫీ 2021-22 సీజన్​ జనవరి 8 నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​ తుది జట్టును ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. తన్మయ్‌ అగర్వాల్‌ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు.

tanmay
తన్మయ్

By

Published : Dec 28, 2021, 6:51 AM IST

Tanmay Agarwal Captain: రంజీ ట్రోఫీ 2021-22 సీజన్‌లో బరిలో దిగే హైదరాబాద్‌ జట్టుకు తన్మయ్‌ అగర్వాల్‌ సారథ్యం వహించనున్నాడు. ఠాకూర్‌ తిలక్‌వర్మ వైస్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. జనవరి 8న ప్రారంభంకానున్న రంజీ ట్రోఫీ కోసం సోమవారం సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ హైదరాబాద్‌ జట్టును ఎంపిక చేసింది. అహ్మద్‌ ఖాద్రి, జాకీర్‌ హుస్సేన్‌, అమోల్‌ షిండే, ఆల్ఫ్రెడ్‌ అబ్సొలెం, ఫయాజ్‌ అహ్మద్‌లతో కూడిన సెలెక్షన్‌ కమిటీ 25 మంది ఆటగాళ్లను జాబితాలో చేర్చినట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ తెలిపాడు.

జట్టు: తన్మయ్‌ అగర్వాల్‌ (కెప్టెన్‌), తిలక్‌వర్మ (వైస్‌ కెప్టెన్‌), చైతన్యరెడ్డి, రాహుల్‌ బుద్ధి, జావిద్‌ అలీ, ప్రతీక్‌రెడ్డి (వికెట్‌ కీపర్‌), సీవీ మిలింద్‌, తనయ్‌ త్యాగరాజన్‌, రోహిత్‌ రాయుడు, మిఖిల్‌ జైశ్వాల్‌, కార్తికేయ కక్‌, చందన్‌ సహాని, హిమాలయ్‌ అగర్వాల్‌, మెహదీ హసన్‌, అలంకృత్‌ అగర్వాల్‌, ధీరజ్‌గౌడ్‌ (వికెట్‌ కీపర్‌), రవితేజ, అబ్రార్‌ మొహినుద్దీన్‌, రక్షణ్‌రెడ్డి, అబ్దుల్‌ ఖురేషి, అఫ్రిది, సూర్యతేజ, వినయ్‌, సక్లాయిన్‌, సూర్య ప్రసాద్‌

ABOUT THE AUTHOR

...view details