తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS NZ: 'కోకా కోలా' జోక్​తో నవ్వించిన భారత కోచ్ - ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కోకాకోలా బాటిల్

టీమ్​ఇండియా ఫీల్డింగ్ కోచ్.. ఈ మధ్య ట్రెండ్ అవుతున్న 'కోకా కోలా'(coca cola) బాటిల్స్ అంశంపై స్పందించారు. తనదైన శైలిలో జోక్ వేసి నవ్వించాడు. వర్షం వల్ల వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్(world test championship) తొలిరోజు ఆట రద్దయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇలా చేశాడు.

Sridhar
శ్రీధర్

By

Published : Jun 19, 2021, 10:22 AM IST

భారత్-న్యూజిలాండ్(ind vs nz) మధ్య శుక్రవారం ప్రారంభం కావాల్సిన డబ్ల్యూటీసీ ఫైనల్​కు(WTC final) వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో తొలిరోజూ ఆట మొదలవకుండానే రద్దయింది. అయినా జట్టు ఆటగాళ్లు వివిధ గేమ్స్​తో కాలక్షేపం చేశారని ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ చెప్పాడు. తొలిరోజు మ్యాచ్ రద్దయిన తర్వాత మీడియా సమావేశానికి హాజరైన అతడు కోకా కోలా జోక్​తో నవ్వించాడు.

ఇటీవల యూరోకప్ ప్రెస్​మీట్​లో రొనాల్డో(ronaldo).. టేబుల్ వద్ద ఉన్న కోకా కోలా బాటిల్స్ తీసేయడం వల్ల ఆ కంపెనీకి దాదాపు రూ.30 వేల కోట్ల నష్టపోయింది. ఆ తర్వాత మరికొందరు ఆటగాళ్లు అదే బాటలో నడిచారు. డబ్ల్యూటీసీ ఫైనల్ తొలిరోజు వర్షం కారణంగా రద్దయిన తర్వాత మీడియా సమావేశానికి వచ్చిన భారత ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్.. అక్కడ కోకా కోలా బాటిల్స్ కోసం వెతికాడు. దానిని చూపిస్తూ నేనూ కోక్​ బాటిల్​ను తీసేయాలా? అలా చేస్తే ఎంత నష్టం వస్తుంది? అంటూ చమత్కరించాడు.

ఇలాంటి చిరాకు సమయంలో ఏ ఆటగాడు బృందాన్ని ఎంటర్​నటైన్ చేస్తాడు అన్న ప్రశ్నకు.. కోహ్లీ(kohli), అశ్విన్, పంత్(rishabh pant) పేర్లు చెప్పాడు శ్రీధర్. "ఇలాంటి సమయంలో వారు (కోహ్లీ, అశ్విన్, పంత్) బాగా సందడి చేస్తారు. మిమిక్రీ, జోక్​లతో నవ్విస్తారు. మమ్మల్ని నవ్వించడంలో కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడు. అశ్విన్​ సరదాగా ఉంటూ తన సొంతశైలిలో సందడి చేస్తాడు. మా బృందంలో ఎక్కువగా జోక్​లు పేల్చేది మాత్రం పంత్. అతడు ఉంటే సందడే సందడి" అని తెలిపాడు శ్రీధర్.

ఇవీ చూడండి: WTC Final: రిజర్వ్ డే ఉంటుందా? ఉండదా?

ABOUT THE AUTHOR

...view details