ఇంగ్లాండ్, భారత్ మహిళల జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ శుక్రవారం జరిగింది. ఇందులో అద్భుతమైన క్యాచ్ పట్టిన హర్లీన్ డియోల్ ఔరా అనిపించింది. 19వ ఓవర్ వద్ద అమీ జోన్స్.. ఆఫ్ సైడ్‌లో భారీ షాట్ ఆడగా.. బౌండ్రీ లైన్ దగ్గర ఉన్న హర్లీన్ సూపర్ మ్యాన్‌లా క్యాచ్‌ను పట్టింది. సిక్స్ వెళ్తుందనుకున్న బాల్‌ను క్యాచ్ పట్టి జోన్స్‌ను పెవిలియన్ పంపింది.
హర్లీన్ క్యాచ్‌ను ఇంగ్లాండ్ మాజీ క్రీడాకారణి ఇశా గుహ, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సమి కొనియాడుతూ ట్వీట్ చేశారు. హర్లీన్ క్యాచ్ వీడియోను బీసీసీఐ సైతం ట్విట్టర్లో పంచుకుంది. మ్యాచ్ ఫలితం మాకు అనుగుణంగా లేదు కానీ ఆటలో ఓ ప్రత్యేకత ఉందంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది.