టీమ్ఇండియాను గాయాల బెడద వేధిస్తోంది. టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే స్టార్ పేసర్ బుమ్రా, స్టాండ్ బైగా ఉన్న దీపక్ చాహర్ జట్టుకు దూరమయ్యారు. అయితే, ఇప్పుడు రిషభ్ పంత్‌కు కూడా గాయమైనట్లు తెలుస్తోంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పంత్ ఆడలేదు. అయితే, అతడు డగౌట్‌లో కూర్చోగా.. అతడి మోకాలికి కట్టు, ఐస్ ప్యాక్‌తో కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
T20 worldcup: టీమ్ఇండియాకు బిగ్ షాక్.. మరో కీలక ప్లేయర్‌కు గాయం - టీ20 ప్రపంచకప్ పంత్‌కు గాయం
టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు మళ్లీ షాక్ తగిలింది. మరో కీలక ప్లేయర్ గాయపడ్డాడు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అంతకుముందు వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ ఆడలేదు. అయితే, గాయం కారణంగానే ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆడనట్లు తెలుస్తోంది. గాయాలతో ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లు జట్టుకు దూరంకాగా.. పంత్‌ను ఇలా చూసిన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. రిషభ్ కూడా ప్రపంచకప్‌నకు దూరమైతే జట్టు మరింత కష్టాల్లో పడుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే, టీమ్‌ఇండియా కానీ బీసీసీఐ కానీ పంత్‌కు గాయమైనట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదీ చూడండి:కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్