తెలంగాణ

telangana

ETV Bharat / sports

అదరగొట్టిన మార్కరమ్, మిల్లర్​​.. సూర్య శ్రమ వృథా.. సఫారీల చేతిలో టీమ్ ​ఇండియా ఓటమి - ప్రపంచకప్​ టీమ్​ఇండియా

T20 World Cup IND Vs SA: టీ20 ప్రపంచకప్​లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా ఓటమి పాలైంది. 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది.

t20 worldcup india vs southafrica
t20 worldcup india vs southafrica

By

Published : Oct 30, 2022, 8:05 PM IST

Updated : Oct 30, 2022, 8:38 PM IST

T20 World Cup IND Vs SA: టీ20 ప్రపంచకప్​లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా ఓటమి పాలైంది. 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది. చివరి ఓవర్‌ వరకు సాగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 133/9 స్కోరు సాధించగా.. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 137 పరుగులు చేసి విజయం సాధించింది. మార్‌క్రమ్‌ (52), డేవిడ్ మిల్లర్‌ (59*) అర్ధశతకాలు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు.

తొలుత టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ (68) ఒక్కడే హాఫ్‌ సెంచరీతో రాణించాడు. రాహుల్‌ (9), రోహిత్‌ (15), కోహ్లీ (12), దీపక్‌ హుడా (0), హార్దిక్‌ (2), దినేశ్ కార్తీక్‌ (6), అశ్విన్‌(7) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4, పార్నెల్ 3, నోకియా 1 వికెట్‌ చొప్పున పడగొట్టారు.

Last Updated : Oct 30, 2022, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details