తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 Worldcup: సెమీస్​ బెర్త్​.. టీమ్ఇండియాకు ఉన్న ఛాన్స్​లివే!

మహిళల టీ20 ప్రపంచ కప్​లో భాగంగా లీగ్‌ దశలో భారత్​ తన చివరి మ్యాచ్‌ ఐర్లాండ్​తో ఆడనుంది. ఒకవేళ భారత్​ ఈ మ్యాచ్​లో గెలిస్తే నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. లేదంటే అవకాశాలు ఉన్నప్పటికీ.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.

T20 Worldcup 2023 teamindia semifinal race
T20 Worldcup 2023 teamindia semifinal race

By

Published : Feb 20, 2023, 3:58 PM IST

ఉమెన్స్​ టీ20 వరల్డ్​ కప్​ 2023 లీగ్‌ స్టేజ్ చివరి దశకు చేరుకుంది. సెమీస్‌ రేసు నుంచి రెండు గ్రూపుల్లోని ఎనిమిది జట్లలో దాదాపు రెండు టీమ్స్​ వైదొలిగాయి. గ్రూప్‌ - ఏ నుంచి ఆస్ట్రేలియా, గ్రూప్‌ - బీ నుంచి ఇంగ్లాండ్‌ సెమీస్‌ బెర్తులను ఇప్పటికే ఖరారు చేసుకోగా.. మిగిలిన రెండు స్థానాల కోసం ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ రేసులో భారత అమ్మాయిలు కూడా ఉన్నారు. మరి మన అమ్మాయిల అవకాశాలు, సమీకరణాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

వరుసగా రెండు విజయాలను అందుకున్న టీమ్​ఇండియా.. మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్​పై ఓడిపోయింది. ఆఖరి వరకు పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో భారత్ అవకాశాలు కాస్త కష్టంగా మారిపోయాయి. ఇక భారత్ లీగ్​ స్టేజ్​లోని​ తన తదుపరి చివరి మ్యాచ్​ను ఐర్లాండ్‌తో ఆడనుంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచుల్లోనూ పరాజయం చెంది సెమీస్‌ రేసు నుంచి తప్పుకుంది ఐర్లాండ్‌. కాబట్టి ఈ జట్టును ఓడించడం భారత్‌కు పెద్ద కష్టమేమి కాదు. కానీ ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఓటమిని చూసినట్లే.

ఇకపోతే ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్ రేణుకా సింగ్‌ మాత్రమే ఐదు వికెట్లతో పదిహేను పరుగులు ఇచ్చి ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. మిగతా బౌలర్లు కాస్త విఫలమయ్యారు. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ ఎక్కువగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక బ్యాటింగ్‌లోనూ షఫాలీ, రోడ్రిగ్స్‌, హర్మన్‌ విఫలమయ్యారు. వీరంతా ఐర్లాండ్‌తో జరగబోయే మ్యాచ్​లో రాణిస్తే జట్టు విజయం సాధిస్తుంది. ఇక స్మృతీ మంధాన తన దూకుడును కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదంటే.

సమీకరణాలు ఇలా..

పాయింట్ల పట్టికలో ఉన్న ఐర్లాండ్‌ (0) టీమ్‌ఇండియా (4 పాయింట్లు).. కాసేపట్లో అనగా సాయంత్రం 6.30గంటలకు తలపడనున్నాయి. ఇందులో భారత జట్టు విజయం సాధిస్తే ఇతర జట్ల సమీకరణాలతో సంబంధం లేకుండానే సెమీస్‌ బెర్తు ఖరారవుతుంది. అలా నాలుగు మ్యాచుల్లో ఆరు పాయింట్లు సాధించి సెమీస్‌కు వెళ్తుంది.

ఒకవేళ ఐర్లాండ్‌పై భారత్​ పరాజయం చెందితే మాత్రం.. వెస్టిండీస్‌ (4 పాయింట్లు), పాకిస్థాన్‌ (2 పాయింట్లు) టీమ్స్​పై డిపెండ్​ అవ్వాల్సి ఉంటుంది. అయితే విండీస్‌ టీమ్​ ఇప్పటికే నాలుగు మ్యాచుల ఆడి నాలుగు పాయింట్లతో కొనసాగుతోంది. కానీ రన్‌రేట్‌ మాత్రం భారత్‌ కన్నా తక్కువే ఉంది. కాబట్టి భారత్‌ భారీ తేడాతో ఓడితేనే ఆ జట్టుకు ఏమైనా అవకాశం ఉండొచ్చు. అదీ కూడా పాక్‌ తన చివరి మ్యాచ్‌లో ఓడిపోవాల్సి ఉంటుంది.

పాకిస్థాన్​కు ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. ఇంగ్లాండ్‌తోనే ఆడాల్సి ఉంది. గత మ్యాచ్‌లో విండీస్‌పై ఓడిపోయింది. దీంతో తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం భారత్‌ కన్నా మెరుగైన రన్‌రేట్‌ కారణంగా సెమీస్‌కు వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కాబట్టి ఇలాంటి సమీకరణాలతో పనిలేకుండా ఉండాలంటే.. ఐర్లాండ్‌పై టీమ్‌ఇండియా గెలిస్తే చాలు. అప్పుడు విండీస్‌, ఐర్లాండ్‌, పాకిస్థాన్‌ ఇంటికెళ్లడం ఖాయం. అప్పుడు గ్రూప్‌ - ఏలోని టాప్‌ జట్టుతో సెమీస్‌లో ఆడాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: IND vs AUS: ఎమర్జెన్సీగా స్వదేశానికి ఆసీస్‌ కెప్టెన్ కమిన్స్​.. ఏమైంది?

ABOUT THE AUTHOR

...view details