తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ క్రికెటర్​ అద్భుత ప్రదర్శనకు కోహ్లీ ఫిదా.. సూపర్ గిఫ్ట్ ఇచ్చాడుగా! - టీమ్​ఇండియా బంగ్లాదేశ్​

బంగ్లా క్రికెటర్​ లిట్టన్ దాస్​ అద్భుత ప్రదర్శనకు టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ కోహ్లీ ఫిదా అయ్యాడు. అతడికి ఓ స్పెషల్​ గిఫ్ట్​ను ఇచ్చాడు.

T20 worldcup 2022
ఆ క్రికెటర్​ అద్భత ప్రదర్శనకు కోహ్లీ ఫిదా

By

Published : Nov 4, 2022, 9:41 AM IST

Updated : Nov 4, 2022, 11:28 AM IST

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నవంబర్‌ 3న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో టీమ్​ఇండియా విజయం సాధించింది. అయితే బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ ఆడిన ఇన్నింగ్స్‌ మాత్రం మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో దాస్​.. భారత బౌలర్లను దాస్‌ బెంబేలెత్తించాడు. 27 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 60 పరుగులు చేశాడు. కేవలం 21 బంతుల్లోనే దాస్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

అయితే ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన లిటన్‌ దాస్‌కు భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఫిదా అయ్యాడు. అతడిని అభినందించాడు. తన బ్యాట్‌న బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ జలాల్ యూనస్ వెల్లడించారు. "మేము డైనింగ్ హాల్‌లో ఉన్నప్పుడు, విరాట్ కోహ్లీ వచ్చి లిటన్‌కు తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇది నిజంగా లిటన్‌కు మధురమైన క్షణం" అని జలాల్ యూనస్ పేర్కొన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి కూడా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 64 పరుగులు చేసిన కోహ్లికి.. మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఇదీ చూడండి:శ్రేయస్ అయ్యర్​ మెరుపు ఇన్నింగ్స్​.. ఫైనల్​లో తొలిసారి ముంబయి

Last Updated : Nov 4, 2022, 11:28 AM IST

ABOUT THE AUTHOR

...view details