తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 worldcup: మళ్లీ అంపైరింగ్‌ పొరపాటు.. ఈసారి ఆ విషయంలో - అప్ఘానిస్థాన్ ఆస్ట్రేలియా మ్యాచ్​ అంపైర్ వివాదం

టీ20 ప్రపంచకప్‌ 2022లో అంపైర్ల నిర్ణయాలపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీమ్​ఇండియా-పాకిస్థాన్‌, భారత్‌-బంగ్లాదేశ్ మ్యాచుల సందర్భంగా అంపైర్ల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు రాగా తాజాగా ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌ మ్యాచ్ విషయంలోనూ పొరపాట్లు దొర్లాయి.

T20 worldcup 2022 umpire issue
మళ్లీ అంపైరింగ్‌ పొరపాటు.. ఈసారి ఆ విషయంలో

By

Published : Nov 5, 2022, 10:15 AM IST

టీ20 ప్రపంచకప్‌ 2022లో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే టీమ్​ఇండియా-పాకిస్థాన్‌, భారత్‌-బంగ్లాదేశ్ మ్యాచుల సందర్భంగా అంపైర్ల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. తాజాగా ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌లోనూ అంపైరింగ్‌ సరిగా లేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా అఫ్గాన్‌ బౌలర్ వేసిన ఒక ఓవర్‌లో కేవలం ఐదు బంతులే వేయించారని సోషల్‌ మీడియాలో చర్చకు తెరలేసింది.

టాస్‌ గెలిచిన అఫ్గానిస్థాన్‌ బౌలింగ్‌ ఎంచుకొంది. నాలుగో ఓవర్‌ను అఫ్గాన్‌ బౌలర్ నవీనుల్‌ హక్‌ వేశాడు. ఆ ఓవర్‌లో కేవలం ఐదు బంతులను మాత్రమే సంధించాడు. అయితే ఓవర్‌ పూర్తయినట్లు అంపైర్లు చెప్పడంతో తర్వాత బౌలింగ్‌కు ముజీబ్‌ వచ్చాడు. అప్పటికీ నాలుగో ఓవర్‌లో ఇంకా ఒక బంతి మిగిలే ఉంది. ఫీల్డ్‌ అంపైర్లు, థర్డ్‌ అంపైర్‌, బ్యాటర్లు, బౌలర్‌ కానీ దీనిని గమనించలేదు. ఆ ఐదు బంతుల్లోనే నవీనుల్‌ 9 పరుగులు ఇచ్చాడు. మొత్తం ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 119 బంతులనే వేసినట్లు ఆసీస్ అభిమానులు నెట్టింట్లో వైరల్‌ చేశారు.

ఇదీ చూడండి:'ఇది వాళ్లిచ్చిన ధైర్యమే.. ఆ దశను సవాల్​గా తీసుకుని పరుగులు సాధిస్తా'

ABOUT THE AUTHOR

...view details