పొట్టి ప్రపంచకప్‌లో మరో కీలక మ్యాచ్‌కు టీమ్ఇండియా సిద్ధమైంది. సెమీఫైనల్ చేరాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో పసికూన జింబాబ్వేతో పోరుకు రోహిత్ సేన సమాయత్తమైంది. ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు ఈ కీలక మ్యాచ్‌లోనూ సాధికార విజయం సాధించి సెమీఫైనల్లో ఘనంగా అడుగుపెట్టాలని వ్యూహాలు రచిస్తోంది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌కు తోడు రాహుల్ కూడా ఫామ్ అందుకోవడం టీమ్ఇండియాకు కలిసి రానుంది. గత నాలుగు మ్యాచ్‌లో 74 పరుగులే చేసిన సారధి రోహిత్ శర్మ నుంచి టీమ్ మేనేజ్‌మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. హార్దిక్ పాండ్యా దినేశ్ కార్తీక్, అశ్విన్‌లతో కూడిన టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో దీపక్ హుడాకు తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. కార్తీక్ స్థానంలో పంత్‌ను తీసుకోవాలన్న డిమాండ్‌లు పెరుగుతున్న దృష్ట్యా టీమ్ మేనెజ్‌మెంట్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
బౌలింగ్‌లోనూ టీమ్ఇండియా బలంగా కనిపిస్తోంది. ఆరంభ ఓవర్లలో భువనేశ్వర్ కుమార్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండగా అర్ష్‌దీప్ అద్భుతంగా రాణిస్తున్నాడు. షమీ కూడా ఫామ్‌లో ఉండడంతో పేస్ విభాగంలో భారత జట్టు పటిష్టంగానే ఉంది. కానీ స్పిన్ విభాగం టీమ్ఇండియాను కలవరపాటుకు గురిచేస్తోంది. అశ్విన్, అక్షర్ పటేల్ భారీగా పరుగులు సమర్పిస్తుండడం మేనేజ్‌మెంట్‌లో ఆందోళనను పెంచుతోంది. అశ్విన్ బ్యాట్‌తో పర్వాలేదనిపిస్తున్నా బాల్‌తో రాణించలేకపోతున్నాడు చాహల్‌కు జట్టులో స్థానం దక్కుతుందన్న అంచనాలు ఉన్నాయి.