తెలంగాణ

telangana

By

Published : Nov 9, 2022, 12:33 PM IST

ETV Bharat / sports

T20 worldcup: ఇంగ్లాండ్​పై టీమ్​ఇండియాదే పైచేయి.. ఈ రికార్డులు తెలుసా?

టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఇంగ్లాండ్​ సెమీస్​ పోరుకు టీమ్​ఇండియా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీ20 ఫార్మాట్​ సహా టీ20 ప్రపంచకప్​లో ఇరు జట్లు ఎన్ని సార్లు తలపడ్డాయి, గత రికార్డులు ఏంటి? వంటి విషయాలను తెలుసుకుందాం.

T20 worldcup 2022 Teamindia vs England
ఇంగ్లాండ్ టీమ్​ఇండియా సెమీఫైనల్​

టీ20 ప్రపంచకప్ 2022 కీలక సమరానికి సిద్ధమైంది. ఇంగ్లాండ్​తో నవంబరు 10న టీమ్​ఇండియా సెమీస్​ ఆడనుంది. ఈ మ్యాచ్​లో మన జట్టు గెలవాలని భారత క్రికెట్​ అభిమానులు ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టే మనోళ్లు కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్​, కేఎల్​ రాహుల్​ బౌలర్లు అర్షదీప్ సింగ్​, షమీ, పాండ్య, భువనేశ్వర్​ కుమార్​ ఫామ్​లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో టీ20 ఫార్మాట్​లో ఇరు జట్లు ముఖాముఖి పోరులో ఎన్ని సార్లు తలపడ్డారు.. అందులో విజయాలు, ఓటములు ఎన్ని తెలుసుకుందాం..

  • గత రికార్డులను పరిశీలిస్తే.. టీ20 ఫార్మాట్‌ ముఖాముఖి పోరు ఇరు జట్లు 22 సార్లు తలపడగా.. భారత్‌ 12 సార్లు, ఇంగ్లాండ్​ 10 సార్లు విజయం సాధించాయి.
  • టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు 3 సార్లు (2007, 2009, 2012) ఎదురెదురుపడగా.. భారత జట్టు 2, ఇంగ్లాండ్​ ఒక్క విజయం సాధించాయి.
  • మరోవైపు మ్యాచ్‌కు వేదిక అయిన అడిలైడ్‌లో ఇంగ్లాండ్​కు చెత్త రికార్డు ఉండటం టీమ్​ఇండియాకు అదనంగా కలిసొచ్చే అంశం. ఈ వేదికపై ఇంగ్లండ్‌ 17 వన్డేలు ఆడగా.. కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఆ జట్టు ఈ వేదికపై ఆడిన ఒకే ఒక టీ20లో (2011) ఆతిథ్య జట్టుపై అతికష్టం మీద గెలిచింది.
  • ఈ రికార్డులే కాక, అడిలైడ్‌లో కోహ్లీ వ్యక్తిగత రికార్డులు, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే వేదికలో బంగ్లాదేశ్‌పై విజయం, ఇంగ్లాండ్​ ఈ వేదికపై ఆడిన అనుభవం లేకపోవడం భారత జట్టుకు అదనంగా కలిసొచ్చే అంశాలు.
  • అయితే మరోపక్క టీమ్​ఇండియాను సమస్యలు కలవరపెడుతున్నాయి. రోహిత్‌ శర్మ ఫామ్‌లో లేకపోవడం, దినేశ్‌ కార్తీక లేక రిషభ్​ పంత.. వీరిద్దరిలో ఎవరిని తీసుకోవాలో తేల్చుకోలేకపోవడం.. స్పిన్నర్ల వైఫల్యం వంటివి భారత జట్టుకు ఆందోళన కలిగిస్తున్నాయి. మరి రేపటి మ్యాచ్​లో భారత జట్టు ఎలా ఆడుతుందో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details