టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరిగిన కీలక పోరులో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ గెలిచింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఫైనల్‌లో అడుగుపెట్టింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది 19.1ఓవర్లోనే ఛేదించింది. రిజ్వాన్(57), బాబర్ అజామ్(53) హాఫ్ సెంచరీలతో మెరవగా.. మహ్మద్ హరీస్(30) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ట్రెంట్ బౌల్ట్ రెండు, మిచెల్ సాంట్నర్ ఓ వికెట్ తీశాడు.
T20 worldcup: కీలక పోరులో కివీస్‌పై విజయం.. ఫైనల్‌కు పాక్
అనూహ్య పరిస్థితుల్లో సెమీస్‌కి చేరి ఆశ్చర్యపరిచిన పాకిస్థాన్.. సెమీపోరులో మాత్రం అద్భుతమైన ప్రదర్శనతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ఫైనల్‌లో అడుగు పెట్టింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కీలక పోరులో కివీస్‌పై విజయం.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పాక్
అంతకుముందు న్యూజిలాండ్‌లో డారిల్ మిచెల్ (53*) అర్ధశతకం సాధించగా.. కేన్ విలియమ్సన్ (46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ (4) విఫలం కాగా.. డేవన్ కాన్వే (21), జేమ్స్ నీషమ్ (16*) ఫర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది 2, మహమ్మద్ నవాజ్ ఒక వికెట్ తీశారు.
ఇదీ చూడండి:ఆ స్టేడియంలో బ్యాట్ పడితే కోహ్లీకి పూనకమే!