తెలంగాణ

telangana

ETV Bharat / sports

సెమీస్​ ముందు టీమ్​ఇండియాకు తప్పిన ప్రమాదం.. కెప్టెన్​ రోహిత్​కు.. - టీమ్​ఇండియా టీ20 ప్రపంచకప్​

టీ20 ప్రపంచకప్​ సెమీఫైనల్​ మ్యాచ్​కు ముందుక టీమ్​ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏమైందంటే?

T20 worldcup 2022 Rohith sharma injured
సెమీస్​ ముందు టీమ్​ఇండియాకు తప్పిన ప్రమాదం.. కెప్టెన్​ రోహిత్​కు..

By

Published : Nov 8, 2022, 10:48 AM IST

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో సెమీఫైనల్​ సమరం ప్రారంభంకాబోతుంది. బుధవారం న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడనుండగా, 10న భారత్​-ఇంగ్లాండ్​ తలపడనున్నాయి. అయితే ఈ సెమీస్​కు ముందు టీమ్​ఇండియాకు ఆందోళన కలిగించే విషయం ఒకటి చోటు చేసుకుంది. మ్యాచ్​ కోసం అడిలైడ్ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించింది.

అయితే నెట్స్‌లో ఆప్షనల్‌ ట్రైనింగ్‌ సెషన్‌ మొదలుపెట్టిన కాసేపటికి.. ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రోహిత్‌ సెమీస్‌లో సత్తా చూపేందుకు ఈ సెషన్‌కు వచ్చాడు. అక్కడ టీమ్‌ఇండియా త్రోడౌన్‌ నిపుణుడు ఎస్‌.రఘుతో కలిసి సాధన మొదలుపెట్టాడు. ఈ క్రమంలో రఘు వేసిన ఓ బంతిని పుల్‌ షాట్‌ కొట్టేందుకు యత్నించాడు. కానీ, అది శరవేగంతో వచ్చి రోహిత్‌ ముంజేతిని బలంగా తాకింది. వెంటనే తీవ్రమైన బాధతో రోహిత్‌ ప్రాక్టిస్‌ సెషన్‌ వదిలి వెళ్లిపోయాడు. కుడిచేతికి పెద్ద ఐస్‌ప్యాక్‌ పెట్టుకొని సెషన్‌ను పరిశీలిస్తూ కూర్చుండిపోయాడు. అ సమయంలో మెంటల్‌ కండీషనింగ్‌ కోచ్‌ పాడీ ఆప్టన్‌తో ఏదో విషయాన్ని తీవ్రంగా చర్చిస్తూ కనిపించాడు. ఐస్‌ ప్యాక్‌ పెట్టడం పూర్తయ్యాక కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని తిరిగి బ్యాట్‌ పట్టుకొని నెట్స్‌లోకి అడుగుపెట్టాడు. కానీ, పూర్తివేగంతో బంతులు వేయద్దని కోరాడు. కేవలం డిఫెన్స్‌ షాట్లు ఆడి తన పరిస్థితిని అంచనావేసుకొన్నాడు. అప్పుడు జట్టు సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

కానీ నొప్పితో బాధపడిన రోహిత్.. ఇంగ్లాండ్​తో మ్యాచ్​కు సిద్ధమవుతాడా అనే ఆందోళన క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే భారత జట్టు బుమ్రా, స్టార్ ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా సేవలను కోల్పోయింది.

ABOUT THE AUTHOR

...view details