తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 worldcup: టీమ్​ఇండియాకు మళ్లీ భారీ షాక్​.. నిన్న రోహిత్​.. నేడు కోహ్లీ!

టీ20 ప్రపంచకప్​ 2022లో భాగంగా ఇంగ్లాండ్​తో జరగబోయే కీలక మ్యాచ్​కు ముందు ఇప్పటికే కెప్టెన్ రోహిత్ గాయపడిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు స్టార్​ బ్యాటర్​ కోహ్లీ కూడా గాయపడ్డాడని సమాచారం అందుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

T20 worldcup 2022 Kohli injured
టీ20 ప్రపంచకప్​ కోహ్లీకి గాయం

By

Published : Nov 9, 2022, 12:03 PM IST

టీ20 ప్రపంచకప్​ 2022లో భాగంగా ఇంగ్లాండ్​తో జరగబోయే కీలక సమరానికి ముందు టీమ్​ఇండియాకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే నెట్​ సెషన్​లో ప్రాక్టీస్ చేస్తుండగా కెప్టెన్​ రోహిత్ శర్మ గాయపడ్డాడు. దీంతో జట్టుతో పాటు క్రికెట్ అభిమానులు ఆందోళన చెందారు. కానీ ప్రస్తుతం తన పరిస్థితి బాగానే ఉందంటూ చిన్న గాయమేనని రోహిత్ స్పందించగా.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కానీ అంతలోనే మళ్లీ భారీ షాక్ న్యూస్ అందింది. సూపర్ ఫామ్​లో ఉన్న కోహ్లీ గాయపడినట్లు తెలుస్తోంది. నెట్​ ప్రాక్టీస్​లో హర్షల్ పటేల్ బౌలింగ్​లో విరాట్​ గాయపడ్డాడని బీసీసీఐ వర్గాల సమాచారం. అయితే కోహ్లీకి ఎక్కడ గాయమైంది, దాని తీవ్రత ఏంటి, సెమీస్​కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఇది తెలిసిన అభిమానులు కంగారు పడుతున్నారు. ఒకవేళ విరాట్​ దూరమైతే భారత జట్టుకు పెద్ద దెబ్బే.

ఇదీ చూడండి:T20 worldcup: గాయంపై స్పందించిన కెప్టెన్ రోహిత్​.. ఇప్పుడెలా ఉన్నాడంటే?

ABOUT THE AUTHOR

...view details