టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన పోరును విరాట్ కోహ్లీ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరేమో. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించిన కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి ఆకట్టుకొన్న విషయం తెలిసిందే. పాక్ జట్టులో ప్రమాదకర బౌలర్‌గా పేరున్న హరీస్ రవూఫ్ వేసిన బంతులకు కోహ్లీ వరుసగా రెండు సిక్సులు బాది చివరి ఓవర్‌లో అద్భుతం చేశాడు.
T20 worldcup: కోహ్లీపై పాక్ స్టార్ బౌలర్ వైరల్ కామెంట్స్.. ఇంకెవరూ అలా చేయలేరంటా!
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లీపై పాక్ ప్రమాదకర బౌలర్ హరీస్ రవూఫ్ వైరల్ కామెంట్స్ చేశాడు. ఏం అన్నాడంటే..
తాజాగా ఈ విషయంపై రవూఫ్ స్పందించాడు. కోహ్లీలా మరే ఆటగాడు బ్యాటింగ్ చేయలేడని అన్నాడు. "ప్రపంచకప్‌లో విరాట్ ఆడిన విధానం అతడి స్థాయిని తెలియజేస్తుంది. అతడెలాంటి షాట్లు ఆడగలడో మనందరికీ తెలుసు. ఆ రోజు మ్యాచ్‌లో కోహ్లీ స్థానంలో ఎవరున్నా నేను విసిరిన బంతులకు అలాంటి షాట్లు ఆడలేకపోయేవారేమో. అయితే, అవి కోహ్లీ కొట్టిన సిక్సులు కాబట్టి సరిపోయింది. అతడు కాకుండా దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా అయ్యుంటే నేను చాలా బాధపడేవాడిని. కోహ్లీ అందరికన్నా విభిన్నమైన శ్రేణి ఆటగాడు" అని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రవూఫ్ వివరించాడు.
ఇదీ చూడండి:Fifa Worldcup: కెప్టెన్ హెడర్ షాట్.. ట్రోఫిని ముద్దాడిన వేళ దిగ్గజ ఆటగాళ్లకు షాక్!