తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ స్టేడియంలో బ్యాట్ పడితే కోహ్లీకి పూనకమే!

నవంబరు 10న అడిలైడ్​ ఇంగ్లాండ్​తో టీ20 ప్రపంచకప్​ సెమీఫైనల్​ ఆడనుంది టీమ్ఇండియా. అయితే ఈ మైదానంతో కోహ్లీ ఓ ప్రత్యేకమైన బంధం ఉంది. విరాట్​ ఆ మైదానంలో బ్యాట్​ పట్టి బరిలో దిగాడంటే ప్రత్యర్థికి చుక్కలే!

adelide kohli records
అడిలైడ్ కోహ్లీ రికార్డ్స్​

By

Published : Nov 9, 2022, 3:09 PM IST

అడిలైడ్‌ వేదికగా నవంబరు 10న టీమ్​ఇండియా-ఇంగ్లాండ్ మధ్య కీలక సెమీస్​ పోరు జరగనుంది. ఈ మ్యాచ్​లో గెలిచేందుకు ఇరు జట్లు విపరీతంగా కసరత్తులు చేస్తున్నాయి.

అయితే మ్యాచ్‌కు వేదిక అయిన అడిలైడ్‌ ఓవల్‌ విషయానికొస్తే.. ఈ పిచ్‌ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఈ స్టేడియంతో స్టార్ బ్యాటర్ కోహ్లీకి మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఈ వేదికపై విరాట్​కు మంచి రికార్డు ఉంది. ఇక్కడ మ్యాచ్‌ అంటేనే కింగ్‌కు పూనకమే! ఇక్కడ అతడు ఆడిన 14 ఇన్నింగ్స్‌ల్లో (మూడు ఫార్మాట్లలో కలిపి) 75.5 సగటున 907 పరుగులు సాధించాడు.

ఇందులో ఏకంగా 5 సెంచరీలు ఉండటం విశేషం. ముఖ్యంగా టీ20ల్లో విరాట్​కు ఈ వేదికపై ఘనమైన రికార్డు ఉంది. ఇక్కడ అతడు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 155.55 సగటున 154 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్​ సెంచరీలు ఉన్నాయి. 2016లో 90*, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై 64 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మరోవైపు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఈ వేదికపై టీమ్​ఇండియాకు ఓ మ్యాచ్‌ ఆడిన(బంగ్లాతో) అనుభవం ఉంది.. అయితే ఇంగ్లాండ్​ మాత్రం ఆ అవకాశం దక్కలేదు.

ఇదీ చూడండి:అగ్రస్థానంలోనే సూర్య.. ఈ సారి కోహ్లీ ర్యాంక్​ ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details