టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తడబడ్డారు. పాక్ బౌలర్ల దెబ్బకు కోహ్లీ(57), పంత్(39) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఫలితంగా ప్రత్యర్థి జట్టు ముందు 7వికెట్లు కోల్పోయి 152 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు రోహిత్‌శర్మ(0), కేఎల్ రాహుల్(3).. తొలి రెండు ఓవర్లోనే షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో వెనుదిరిగారు. ఐదో ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ హసన్ అలీ బౌలింగ్ షాట్‌కు యత్నించి కీపర్ రిజ్వాన్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో తొలి పది ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది టీమ్ఇండియా. ఆ తర్వాత ధనాధన్ ఆడిన పంత్(39), జడేజా(13), కోహ్లీ(57) నాలుగు, ఐదు, ఆరు వికెట్లుగా వెనుదిరిగారు.