ఇదంతా టీ20 కాలం.. ప్రస్తుతం ఐపీఎల్ రెండో ఫేజ్ ప్రేక్షకుడిని గిలిగింతలు పెట్టిస్తోంది. వచ్చే నెల మధ్య వరకు ఐపీఎల్ హవా కొనసాగనుంది. ఆ తర్వాత వెంటనే వచ్చేస్తున్నానంటూ అంతర్జాతీయ టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) క్రీడాభిమానుల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమైపోయింది. భారత్ ఆధ్వర్యంలో యూఏఈ, ఒమన్ వేదికగా 16 జట్లు ఈ టోర్నీ(t20 world cup 2021 india team)లో పాల్గొంటాయి. ఈ క్రమంలో ప్రపంచకప్ పోటీలకు సంబంధించి ఐసీసీ ప్రత్యేకగీతాన్ని(t20 world cup 2021 theme song) రూపొందించింది. యానిమేషన్ క్యారెక్టర్లతో భారతీయ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది కంపోజ్ చేసిన థీమ్ సాంగ్ వైరల్‌గా మారింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, పొలార్డ్, రషీద్ ఖాన్, గ్లెన్ మాక్స్‌వెల్ యానిమేషన్ క్యారెక్టర్లు ఆకట్టుకున్నాయి.
T20 World Cup 2021: వైరల్‌గా టీ20 ప్రపంచకప్ థీమ్ సాంగ్ - టీ20 ప్రపంచకప్ లేటెస్ట్ న్యూస్
అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) ప్రారంభంకాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ పోటీలకు సంబంధించి ఐసీసీ ప్రత్యేకగీతాన్ని రూపొందించింది. యానిమేషన్ క్యారెక్టర్లతో భారతీయ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది కంపోజ్ చేసిన థీమ్ సాంగ్ వైరల్‌గా మారింది.
అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) పోటీలు జరుగుతాయి. 'లివ్ ద గేమ్.. లవ్ ద గేమ్' థీమ్(t20 world cup 2021 theme song)తో ప్రపంచంలోని నలుదిక్కుల అభిమానులు ఆటను ఆస్వాదిస్తున్నట్లు వీడియోను ఐసీసీ రూపొందించింది. అమిత్ త్రివేది అద్భుతంగా కంపోజ్ చేసిన వీడియోలో వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్ల జెర్సీలను, జాతీయ జెండాలను చూపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వినసొంపైన మ్యూజిక్‌తో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీ20 ఛాంపియన్ విండీస్ సారథి పొలార్డ్, ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, అఫ్గానిస్థాన్ కీలక ఆటగాడు రషీద్ ఖాన్ అవతార్ యానిమేషన్ క్యారెక్టర్లతో గ్రౌండ్‌లోకి దూకుతూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తారు. టీ20 ప్రపంచకప్ కోసం ఒకరికొకరు పోటీ పడుతున్నట్లు థీమ్ సాంగ్‌లో చూపించారు. మరి ఆ థీమ్ సాంగ్ మీరూ చూసేయండి..