యూఏఈ వేదికగా త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించాడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారి. ఒక్కో దేశం నుంచి 15 మంది ప్లేయర్లకు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అనుమతి కల్పించనున్నట్లు పేర్కొన్నాడు. వీరితో పాటు మరో 8 మంది అధికారులకు అవకాశం ఉందని తెలిపాడు.
సెప్టెంబర్ 10లోపు.. ప్రపంచకప్‌లో పాల్గొనే ప్రతి జట్టూ 23 మంది సభ్యుల (కోచ్‌లు, సహాయక సిబ్బందితో కలిపి) వివరాలను సమర్పించాలని ఐసీసీ చెప్పినట్లు తెలిపాడు. కరోనా పరిస్థితి, బయోబబుల్ నేపథ్యంలో.. అదనపు ప్లేయర్లను కూడా ఐసీసీ అనుమతిస్తుందని, కానీ ఆ ఖర్చులు సంబంధిత క్రికెట్ బోర్డులే భరించాల్సి ఉంటుందని వివరించాడు.
''ఐసీసీ 15 మంది ప్లేయర్లు, 8 మంది అధికారుల ఖర్చులను మాత్రమే భరిస్తుంది. అదనపు ప్లేయర్లు, సిబ్బంది కావాలనుకుంటే.. ఆ ఖర్చులను సంబంధిత బోర్డులే చూసుకోవాలి.''