తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నిలకడతో పాటు వేగంగా ఆడితే విజయం మాదే' - morgan on wc

యూఏఈ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్​పై స్పందించాడు ఇంగ్లాండ్​ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. నిలకడైన ఆటతీరే తమ జట్టుకు అతిపెద్ద బలమని పేర్కొన్నాడు. దీనికి వేగాన్ని జోడించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు.

eoin morgan
ఇయాన్ మోర్గాన్

By

Published : Aug 20, 2021, 6:40 PM IST

రానున్న టీ20 ప్రపంచకప్​పై ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పందించాడు. టైటిల్​ ఫెవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగుతున్న తమకు నిలకడే అతిపెద్ద బలమని పేర్కొన్నాడు.

టీ20 ఫార్మాట్​లో మాకు అతిపెద్ద బలం స్థిరత్వం. గత రెండేళ్లుగా నిలకడైన ఆటతీరును ప్రదర్శించాం. టీ20ల్లో కొద్దిలో ఆట మారిపోతుంది. మా గ్రూపులో ఉన్న జట్లన్నీ బలమైనవే. ప్రతి మ్యాచ్​ మాకు చాలా ముఖ్యమైనది.

-ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్​ కెప్టెన్.

నిలకడతో పాటు యూఏఈలో వీలైనంత వేగంగా ఆడటానికి ప్రయత్నించడం చాలా ముఖ్యమని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై కాకుండా వేరే దేశంలో టోర్నీ జరగనుండటం వల్ల అక్కడి పరిస్థితులకు తొందరగా అలవాటు పడటం అవసరమని పేర్కొన్నాడు. ఇప్పటికే ఇంగ్లాండ్​ 2010లో టీ20 ప్రపంచకప్​, 2019లో వన్డే ప్రపంచకప్​ను గెలుపొందిందని తెలిపాడు​.

చివరగా 2016లో జరిగిన టీ20 ఫైనల్​ను గుర్తు చేసుకున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్. ఆ మ్యాచ్​లో తృటిలో విజయాన్ని కోల్పోయింది ఇంగ్లాండ్​. చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్​లు బాది తమ రెండో టైటిల్​ ఆశలపై నీళ్లు చల్లాడు విండీస్​ బ్యాట్స్​మన్​ కార్లోస్​ బ్రాత్​వైట్​.

ఇదీ చదవండి:సిరాజ్​.. హైదరాబాద్​ రజనీకాంత్​- భారీ కటౌట్​ ఏర్పాటు ​

ABOUT THE AUTHOR

...view details