డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్టిండీస్‌తో టీ20 ప్రపంచకప్ తొలిపోరులో తలపడనుంది ఇంగ్లాండ్. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది.
గత టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఈ రెండు జట్లూ తలపడగా.. ఉత్కంఠపోరులో విజయం సాధించింది వెస్టిండీస్. చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా.. స్టోక్స్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సులు బాది విండీస్‌ను గెలిపించాడు బ్రాత్‌వైట్. అయితే తాజాగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో అటు స్టోక్స్‌తో పాటు బ్రాత్‌వైట్ కూడా లేకపోవడం గమనార్హం.
జట్లు