క్రీడాస్ఫూర్తి.. ఇది ఏ ఆటలోనైనా క్రీడాకారులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. అందుకు టీమ్‌ఇండియా, పాక్ ఆటగాళ్లు కూడా మినహాయింపు కాదు. ముఖ్యంగా టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ క్రీడాస్ఫూర్తి చాటడంలో ముందుంటారు. ఆ విషయాన్ని తాజాగా మరోసారి నిరూపించారు. పాకిస్థాన్‌తో(T20 world cup 2021 updates) ఓటమిపాలయ్యాక విరాట్.. బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ దగ్గరికెళ్లి హత్తుకొని మరీ నవ్వుతూ అభినందించాడు. ఈ సన్నివేశాలు ఇరు జట్ల అభిమానులను ఆకట్టుకున్నాయి.
కోహ్లీ, ధోనీ క్రీడాస్ఫూర్తి.. భారత్ - పాక్ జట్లపై ఐసీసీ హర్షం - icc on ind vs pak match
మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ క్రీడాస్ఫూర్తి పట్ల ఐసీసీ హర్షం వ్యక్తం చేసింది. అందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. 'ఇది కదా నిజమైన క్రీడాస్ఫూర్తి' అంటూ భారత్-పాక్ క్రికెట్ జట్లను(nd vs pak t20 world cup 2021) మెచ్చుకుంది.
![కోహ్లీ, ధోనీ క్రీడాస్ఫూర్తి.. భారత్ - పాక్ జట్లపై ఐసీసీ హర్షం Spirit of Cricket](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13458564-thumbnail-3x2-spiritofcricket.jpg)
మరోవైపు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఎలా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఆన్‌ఫీల్డ్ అయినా, ఆఫ్ ఫీల్డ్ అయినా తనదైన వ్యక్తిత్వంతో ఆకట్టుకుంటాడు. సింపుల్‌గా ఉంటూ ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతాడు. ఈ క్రమంలోనే ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాడు. భారత్-పాక్ మ్యాచ్(T20 world cup 2021 updates) అనంతరం అతడు మైదానంలోనే పలువురు దాయాది జట్టు ఆటగాళ్లతో కలిసి ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆటకు సంబంధించిన కొన్ని విషయాలను వారితో సంతోషంగా పంచుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. ఇది కదా నిజమైన క్రీడాస్ఫూర్తి అంటూ భారత్-పాక్ క్రికెట్ జట్లను(T20 world cup 2021 news) మెచ్చుకుంది. దాయాదుల పోరుపై బయట ఉండేటంత భావోద్వేగం, ఉద్రేకం లాంటివి రెండు జట్ల మధ్య ఉండవని అభిప్రాయపడింది. ఆ ఫొటోలు, వీడియో మీరూ చూసి ఆనందించండి.