తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 World Cup: కెప్టెన్స్‌ డే.. ఒకే ఫ్రేమ్‌లో 16 మంది..

టీ20 ప్రపంచకప్​లో భాగంగా నిర్వహించిన 'కెప్టెన్స్‌ డే' కార్యక్రమంలో 16 మంది సారథులు కలిసి సందడి చేశారు. సెల్ఫీలు దిగారు. జట్టు సన్నద్ధత గురించి వివరించారు.

T20 world cup Captains Day 16 captains in one frame
కెప్టెన్స్‌ డే.. ఒకే ఫ్రేమ్‌లో 16 మంది కెప్టెన్లు..

By

Published : Oct 15, 2022, 11:07 AM IST

క్రికెట్‌ లవర్స్​ ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్‌ సమరానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన 'కెప్టెన్స్‌ డే' కార్యక్రమంలో 16 మంది సారథులు పాల్గొన్నారు. మెగా టోర్నీకి వారు ఎలా సిద్ధమయ్యారో వివరించారు. దీనికి సంబంధించిన ఫొటోను ఐసీసీ ట్విటర్‌లో పంచుకుంది. 'ఒకే ఫ్రేమ్‌లో 16 మంది కెప్టెన్లు..' అంటూ రాసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో కెప్టెన్లు సెల్ఫీ తీసుకుని సందడి చేశారు. ఈ క్రమంలోనే టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. జట్టు సన్నద్ధత గురించి వివరించారు. అలాగే దాయాది పాక్‌తో జరిగే హైవోల్టేజ్‌ మ్యాచ్‌పై కూడా మాట్లాడారు.

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 సమరానికి ముందు తొలి రౌండ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆదివారం నుంచి ఈ రౌండ్‌ మ్యాచ్‌లు ఆరంభమవుతాయి. సూపర్‌-12లో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలను దక్కించుకోవడం కోసం తొలి రౌండ్లో ఎనిమిది జట్లు పోటీపడతాయి. ఇప్పటికే అఫ్గానిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, భారత్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా సూపర్‌-12కు అర్హత సాధించాయి. అర్హత రౌండ్లో గ్రూప్‌- ఎ లో నమీబియా, నెదర్లాండ్స్‌, శ్రీలంక, యూఏఈ, గ్రూప్‌- బి లో ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, వెస్టిండీస్‌, జింబాబ్వే పోటీపడనున్నాయి. గ్రూప్‌లో ఒక్కో జట్టు మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. గ్రూప్‌ దశ ముగిసే సరికి ఒక్కో గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-12లో ఆడే ఛాన్స్‌ కొట్టేస్తాయి. ఈ నెల 22 నుంచి సూపర్‌-12 సమరం మొదలవుతుంది.

కెప్టెన్స్‌ డే.. ఒకే ఫ్రేమ్‌లో 16 మంది కెప్టెన్లు..

ఇదీ చూడండి:T20 worldcup: కోహ్లీపై​.. ఏ మంత్రం పని చేసిందో?

ABOUT THE AUTHOR

...view details