T20 World Cup 2024 Venue And Schedule : మరో 13 రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రపంచకప్‌తో పాటు వచ్చే 2024 టీ20 వరల్డ్ కప్ కోసం కూడా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. వచ్చే ఏడాది వెస్టిండీస్(కరీబియన్), అమెరికా సంయుక్తంగా ఈ టీ20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇవ్వనుంది. వరల్డ్ కప్ మ్యాచ్‌లను మొదటి సారి అమెరికాలో జరగనుండటం విశేషం. అయితే 2024 ప్రపంచకప్ టోర్నీ తేదీలను, వేదికలను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
2024 టీ20 వరల్డ్ కప్ టోర్నీ వచ్చే ఏడాది జూన్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జూన్ 30న ఫైనల్ నిర్వహించనున్నారు. వెస్టిండీస్‍లోని అంటిగ్వా అండ్ బార్బుడా, బార్బొడాస్, డొమినికా, సెయింట్ లూసియా, గయానా, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనెడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో 2024 ప్రపంచ కప్ మ్యాచ్‍లు నిర్వహించనున్నారు. అమెరికాలో డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ వేదికగా జరగనున్నాయి. మొత్తంగా వెస్టిండీస్‍లో ఏడు, అమెరికా మూడు వేదికలుగా 2024 ప్రపంచకప్ మ్యాచ్‍లు నిర్వహించనున్నారు.
T20 World Cup 2022 Team List : మొత్తంగా 20 జట్లు ఈ టోర్నీలో పోటీపడనున్నాయి. 10 వేదికల్లో 55 మ్యాచ్‍లు జరగనున్నాయి. వీటిలో 39 మ్యాచ్‍ల వరకు వెస్టిండీస్‍లోని ఏడు వేదికల్లో జరిగే అవకాశం ఉంది. అమెరికాలోని మూడు వేదికల్లో 16 మ్యాచ్‍లు జరగొచ్చు. ఈ పూర్తి మ్యాచ్‍ల షెడ్యూల్‍ను వచ్చే ఏడాది ఆరంభంలో ఐసీసీ ఖరారు చేసే ఛాన్స్ ఉంది.