T20 World Cup 2024 India Vs Pakistan :ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో జైత్రయాత్ర సాగించి ఫైనల్లో చతికలపడ్డ టీమ్ఇండియా.. టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడాలని తహతహలాడుతోంది. అయితే ఈ పొట్టి వరల్డ్ కప్ మరో ఆరునెలల్లో ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో దాదాపు 20 జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి.
అయితే క్రికెట్ ఫ్యాన్స్ అందరి దృష్టి మరోసారి దాయాదుల పోరుపై ఉండటం సహజమే. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జూన్ 9వ తేదీన మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. గ్రూప్ స్టేజ్‌లో టీమ్ఇండియా మ్యాచ్‌లు జూన్ 5 ప్రారంభమవుతాయి. మిగతా నాలుగు జట్లతో యూఎస్‌ఏ వేదికగానే భారత్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇంకా అధికారికంగా షెడ్యూల్ ఖరారు కాలేదు.
టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా సూపర్-8కు వెళ్తే జూన్ 20 నుంచి మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఈ స్టేజ్‌లో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ వెస్టిండీస్‌లో జరుగుతాయని తెలుస్తోంది. జూన్ 29వ తేదీన ఫైనల్ మ్యాచ్‌లో బార్బడోస్ వేదికగా జరగనుందట. అయితే పొట్టి కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఆడతారనే ఊహాగానాలు వస్తున్నాయి. కానీ, దాదాపు సంవత్సరం నుంచి వీరిద్దరూ టీ20ల్లో పాల్గొనలేదు. ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగా టీమ్‌ఇండియా ఎంపిక ఉంటుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ మ్యాచ్‌లు ఇలా (అంచనా)
- ఐర్లాండ్‌తో న్యూయార్క్ వేదికగా జూన్ 5న
- పాకిస్థాన్‌తో న్యూయార్క్ వేదికగా జూన్ 9న
- యూఎస్‌ఏతో న్యూయార్క్ వేదికగా జూన్ 12న
- కెనడాతో ఫ్లోరిడా వేదికగా జూన్ 15న
అయితే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వేదికను ఇంగ్లండ్‌కు మార్చాలని ఐసీసీ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ మరో 6 నెలల్లోనే ఉంది. ఆలోపు అమెరికాలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్చడం అంత సులభం కాదట. అందుకే ఈ టోర్నీని నిర్వహించాలని ఇంగ్లండ్‌ను రిక్వెస్ట్ చేయాలని ఐసీసీ అనుకుంటోందట. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. కాగా, గతంలో ఐసీసీ ప్రకటన ప్రకారం 2030 టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్‌లో జరగాల్సి ఉంది.