తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్‌ శర్మపై ఫ్యాన్స్‌ ఫుల్​ ఫైర్‌.. ఐపీఎల్‌ కెప్టెన్‌ అంటూ సెటైర్లు - కేఎల్​ రాహుల్​ టీమ్​ ఇండియా

Rohith Sharma Captaincy: ఐసీసీ టీ20 సెమీఫైనల్లో టీమ్​ఇండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మను నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రోహిత్‌ ఐపీఎల్‌లో మాత్రమే జట్టును గెలిపిస్తాడంటూ సైటర్లు వేస్తున్నారు. మరోవైపు, రాహుల్​ను నెటిజన్లు దారుణంగా విమర్శిస్తున్నారు.

t20-world-cup-2022-semis-netizens-trolls-on-kl-rahul-and-rohithsharma
t20-world-cup-2022-semis-netizens-trolls-on-kl-rahul-and-rohithsharma

By

Published : Nov 10, 2022, 7:23 PM IST

Rohith Sharma Captaincy: ఐసీసీ టీ20 సెమీఫైనల్లో టీమ్​ఇండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంగ్లాండ్‌ జట్టుకు కనీస పోటీ కూడా ఇవ్వకుండా భారత్‌ పరాజయం చెందడం పట్ల ఫ్యాన్స్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను దుమ్మెత్తి పోస్తున్నారు. ట్విట్టర్​లో ఫొటోలు, వీడియోలు, కామెంట్లతో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో మాత్రమే జట్టును గెలిపిస్తాడంటూ సైటర్లు వేస్తున్నారు.

అదే సమయంలో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని తలచుకుంటున్నారు. అందరి కంటే 'మిస్టర్‌ కూల్‌' బెటరంటూ ప్రశంసిస్తున్నారు. దీంతో #captaincy హాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. టీమ్​ఇండియా కెప్టెన్సీని స్వచ్చందంగా రోహిత్‌ వదులుకోవాలని కొంతమంది సలహా ఇస్తున్నారు.

ఈ ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడిన స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీని కూడా అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. ఆట పట్ల అతడి అంకితభావాన్ని ఎవరూ శంకించలేరని గట్టిగా చెబుతున్నారు. బౌలింగ్‌ బలంగా లేకపోవడం వల్లే టీమ్​ఇండియా ఓడిందని కొంతమంది పేర్కొంటున్నారు.

రాహుల్​పై నెటిజన్స్​ ట్రోల్స్​
గత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా రెండు అర్ధశతకాలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్లే కన్పించిన టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌.. మళ్లీ విఫలమయ్యాడు. కీలకమైన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో కేవలం 5 పరుగులే చేసి నిరాశపర్చాడు. దీంతో నెట్టింట అతడిపై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ వస్తున్నాయి. "రాహుల్‌.. ఇంకెన్నాళ్లు బాధపెడతావ్‌?" అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ఈ టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో రాహుల్‌ ప్రదర్శన దారుణంగా ఉంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండు మినహా.. నాలుగు ఇన్నింగ్స్‌లో అతడి స్కోరు రెండంకెలు కూడా దాటలేదు. పాకిస్థాన్‌పై 4, నెదర్లాండ్స్‌పై 9, దక్షిణాఫ్రికాపై 9 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత తిరిగి తన లయను అందుకున్న కేఎల్‌.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా అర్ధశతకాలు(బంగ్లాపై 50, జింబాబ్వేపై 51) సాధించి అభిమానుల్లో ఆశలు రేపాడు. అయితే గురువారం జరిగిన కీలకమైన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. నేటి మ్యాచ్‌లో తొలి బంతికే బౌండరీ బాదిన రాహుల్‌.. రెండో ఓవర్‌కే పెవిలియన్‌కు చేరాడు. కేవలం 5 బంతులు ఎదుర్కొని 5 పరుగులే చేశాడు.

ఇదీ చదవండి:గోవా బీచ్​లో సచిన్ సందడి.. మత్స్యకారులతో కలిసి చేపలు పడుతూ..

'ధనుష్క.. 'ఆమె' గొంతును బిగించి నరకం చూపించాడు'

ABOUT THE AUTHOR

...view details