టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది నెదర్లాండ్. సెమీఫైనల్‌కు చేరుతుందని భావించిన దక్షిణాఫ్రికా.. 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు చేసింది.
నెదర్లాండ్స్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ 3 వికెట్లతో సఫారీల నడ్డి విరిచాడు. బాస్ డీ లీడ్, ఫ్రెడ్ క్లాసెన్ రెండేసి వికెట్లు తీశారు. క్వింటన్ డికాక్ (13), బవుమా (20), మార్కరమ్ (17) క్లాసెన్ (21), మిల్లర్ (17) సహా బ్యాటర్లు అందరూ విఫలం అయ్యారు. రైలీ రోసో (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోవడం వల్ల జింబాబ్వే మ్యాచ్ గెలుపోటములతో సంబంధం లేకుండా భారత్ సెమీఫైనల్ కు చేరుకుంది. మరోస్థానం కోసం పాకిస్థాన్, బంగ్లాదేశ్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీఫైనల్ కు చేరుతుంది.