T20 World Cup Ind Vs Zim: మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (59*: 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) వీర విహారానికి తోడు.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (51: 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) సమయోచిత ఇన్నింగ్స్ ఆడటంతో జింబాబ్వేకి భారత్ 187 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.
హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన సూర్య, రాహుల్.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?
T20 World Cup Ind Vs Zim: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు 186 పరుగులు సాధించింది. ప్రత్యర్థి జట్టుకు 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
t20 world cup 2022 ind vs zim
తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (3) విఫలం కాగా.. విరాట్ కోహ్లీ 26, హార్దిక్ పాండ్య 18, రోహిత్ శర్మ 15 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లు సీన్ విలియమ్స్ 2.. ఎన్‌గరవ, ముజరబని, సికందర్ రజా తలో వికెట్ తీశారు. సూర్యకుమార్ (59*) దూకుడుగా ఆడి హాఫ్‌సెంచరీతో పాటు టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఇవీ చదవండి:
Last Updated : Nov 6, 2022, 3:21 PM IST