T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ నిర్వహణపై దృష్టి పెట్టింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). ఈ మేరకు జనవరి 21న మ్యాచ్లకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నట్లు పేర్కొంది. పలు మ్యాచ్ల కోసం టిక్కెట్ల అమ్మకం కూడా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. 2007లో టీ20 ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కాగా.. ఇది ఎనిమిదో పొట్టి ప్రపంచకప్ టోర్నీ.
45 మ్యాచ్లు..
ఈ మెగా టోర్నీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది. ఏడు మైదానాల్లో మొత్తంగా 45 మ్యాచ్లు జరగనున్నాయి. అడిలైడ్, బ్రిస్బేన్, గీలాంగ్, హోబర్ట్, మెల్బోర్న్, పెర్త్, సిడ్నీ మైదానాలు పొట్టి ప్రపంచకప్ వేదికలు కానున్నాయి. ఫైనల్, నవంబర్ 13న మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో జరగనుంది. సెమీఫైనల్స్ సిడ్నీ, అడిలైడ్, ఓవల్ వేదికగా నవంబర్ 9, 10న నిర్వహించనున్నారు.
సూపర్ 12..